ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన AI for Andhra Police Hackathon 2025 - (Empowering law enforcement through AI Agents)లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ Quadric IT సంస్థ రెండో స్థానంలో నిల్చింది. కృత్రిమ మేథను ఉపయోగించి ప్రజాపాలన, సంరక్షణే లక్ష్యంగా ఆ సంస్థ బ్లూ క్వయిరీ అనే ప్రాజెక్టును ప్రదర్శించింది. దేశం నలుమూలల నుంచి 57 సంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజా భద్రతా, పోలీసింగ్ సవాళ్లను ఎదుర్కొవటం, విపత్కర పరిస్థితుల్లో కృత్రిమ మేధ ఉపయోగం లాంటి అంశాలపై సంస్థలు తమ ప్రాజెక్టుల్ని రూపొందించాయి.
ఇంగ్లీష్, మరియు తెలుగు భాషల్ని ఉపయోగించిన ఈ ప్రాజెక్టు, కేసుల విచారణకు ఉపయోగడేలా క్వాడ్రిక్ సంస్థ రూపొందించింది.
సుజయ్ అనిశెట్టి, సాయి అజిత్ భరద్వాజ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పూషించారు. ఈ ప్రాజెక్టుకు రఘురామ్ తాటవర్తి, కేసరి సాయి కృష్ణ, సబ్నీ వీసు, కమల్ చంద్ కొత్త, ప్రియతమ్ తాటవర్తి పర్యవేక్షించారు.
గట్టి పోటీ మధ్య క్వాడ్రిక్ రెండో విజేతగా నిల్చిందని ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న రఘురామ్ తాటవర్తి చెప్పారు. బ్లూ క్వయిరీని పూర్తిస్థాయి ప్రాజెక్టుగా వృద్ధి చేసేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం చెప్పినట్టు ఆయన వివరించారు. క్వాడ్రిక్ ఐటీ సంస్థను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించి, ఈ విభాగంలో మరింత కృషి చేయాలని సూచించారు.

