Dailyhunt
పసిపాపపై రేప్‌, హత్య కేసు..21 రోజుల్లో తీర్పు

పసిపాపపై రేప్‌, హత్య కేసు..21 రోజుల్లో తీర్పు

న్యూఢిల్లీ: రెండున్నరేండ్ల వయసున్న పసిపాపపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. కేవలం 21 రోజుల్లో విచారణను పూర్తి చేసి బుధవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గతేడాది అక్టోబర్‌ 19న చందన్‌ అనే వ్యక్తి పసికందును అపహరించాడు. అనంతరం లైంగికదాడికి పాల్పడి, హత్య చేశాడు. చిన్నారి తండ్రి స్నేహితుడైన చందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana