Dailyhunt
పవన్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా సత్యమేవ జయతే సాంగ్..!

పవన్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా సత్యమేవ జయతే సాంగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "వకీల్ సాబ్". మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. కాగా గత ఏడాది మార్చ్‌లో ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా నుంచి మగువ మగువ తొలి పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి నేడు రెండో పాట విడుదలైంది.

అయితే సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, లెజెండ్‌ సింగర్‌ శంకర్‌ మహాదేవన్‌తో కలిసి పృథ్వీచంద్ర పాడాడు.

థమన్‌ చక్కటి మ్యూజిక్ అందించాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా ఈ పాట ఉండడం, లిరిక్స్ కూడా అదిరిపోవడంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Newtelugunews.com