మనం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను అరువు తెచ్చుకోవటం కాదు... మన సినిమాలను కూడా హాలీవుడ్ లో రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 1997లో రిలీజ్ అయిన హిట్ సినిమా ఆహ్వనం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరాలు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా చూసినప్పుడు ఎవరూ ఈ మూవీ హాలీవుడ్ లో రీమేక్ అవుతుందని ఆలోచించి ఉండరు. దర్శక నిర్మాతలు మాత్రం తమ కథ హాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా అలరిస్తుందని భావించారు. అందుకే తెలుగులో ఈ సినిమాను రూపొందించిన అదే టీం హాలీవుడ్ లోనూ రీమేక్ చేశారు.
తెలుగులో ఆహ్వనం పేరుతో రిలీజ్ అయిన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో రీమేక్ చేశారు.
తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన ఎస్వీ కృష్ణారెడ్డి హాలీవుడ్ వర్షన్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. హాలీవుడ్లో ఈ సినిమాను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్ వెంకట్, ఎమ్ ఎస్ పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఆర్ వెంకట్లు నిర్మించారు. ఈ సినిమాలో జొనాతన్, బెన్నెట్, జమీ లిన్ సిగ్లర్, నదియా బ్జోర్లిన్లు కీలక పాత్రల్లో నటించారు. ఇతర టెక్నీషియన్స్ అంతా హాలీవుడ్ నుంచే వర్క్ చేసిన ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యింది.
తెలుగులో రెండున్నర గంటల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా గంటా 40 నిమిషాలకు కుదించారు. ఈ ఇండియన్ నేటివ్ కథా హాలీవుడ్ అభిమానులను కూడా ఆకట్టుకుంది. అయితే ఆహ్వానం సినిమా కథ కూడా మరో తెలుగు సినిమా నుంచి తీసుకుందే. 1959లో రిలీజ్ అయిన అక్కినేని నాగేశ్వరరావు క్లాసికల్ హిట్ పెళ్లి నాటి ప్రమాణాలు సినిమా కథ ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాను రూపొందించాడు.
పేదలు వలస కూలీల ఖాతాల్లోకి నగదు : నిర్మలా సీతారామన్
12 నెలల మారటోరియంతో రుణాలు: నిర్మలా సీతారామన్
50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ లకు నిధి ఏర్పాటు : నిర్మలా సీతారామన్
కొడుకు ఫ్యూచర్‌పై బెంగ పెట్టుకున్న మాజీ మంత్రి... జగన్ అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్..!
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ... ఆర్థిక మంత్రి కీలక ప్రకటన...!
పేదలు, వలస కూలీల ఖాతాల్లోకి నగదు... నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
నిర్మల చెప్పిన 5 సూత్రాలు ఇవే...!
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - JSR

