Dailyhunt
పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ పాత్రలో నటిస్తున్న అనసూయ..??

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ పాత్రలో నటిస్తున్న అనసూయ..??

బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హిందీ సినిమా పింక్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేవలం 30 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కి దాదాపు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా చేస్తుండగానే మరో మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టినట్లు వార్తలు వినపడుతున్నాయి. కాగా అఫీషియల్ గా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.

అంతే కాకుండా సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఈ మధ్యన మొదలయ్యాయి.

ఔరంగజేబు తరహాలో బందిపోటు దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ ని సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన మరో దొంగ పాత్రలో హాట్ యాంకర్ అనసూయా కి కూడా క్యారెక్టర్ క్రిష్ రెడీ చేస్తున్నట్లు వార్తలు తాజాగా వినబడుతున్నాయి. వన్ కళ్యాణ్‌కు సహకరించే పవర్‌ఫుల్ బందిపోటుగా అనసూయ కనిపిస్తుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా గతంలో అనసూయకి అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ రాగా డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో అది వదిలేసుకుంది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం రావడం ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

వేరొకరిని నేను తక్కువ చేయను.....మా సినిమాకు వచ్చిన వసూళ్లు మేము ప్రకటించాం.....!! మా సినిమాను బ్రహ్మోత్సవం మాదిరిగా చేయవు కదా బ్రదరూ...??గోదావరి ఎఫెక్ట్: బోటు ప్రమాదాల నివారణ కోసం జగన్ సర్కారు కొత్త విధానం..? సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KSK
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald