వాషింగ్టన్: కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ.. అమెరికాను ‘హవానా సిండ్రోమ్’ కలవరపెడుతున్నది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు కనుగొనలేకపోయారు.
ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వం ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, అలాగే బాధిత అధికారులకు మెరుగైన వైద్య సంరక్షణను అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.
నాకు తెలిసి ఆ రోజుల్లో ఎక్కువగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో) నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, శ్రీకాకుళం, కర్నూలు, విశాఖ జిల్లాలలో బలంగా ఉన్న నక్సలైట్ ఉద్యమం ఏ కారణాల వల్ల దాదాపు లేకుండా పోయింది ? అసలు నక్సలైట్ ఎలా పుట్టాడు? ఆ రోజుల్లో యువకులు నక్సలైట్లుగా ఎందుకు మారేవారు?.... ఆ రోజుల్లో చదువుకున్నవారికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎక్కువగా ఉండడం వల్ల మరియు రాజకీయ నాయకుల దౌర్జన్యాలు ఇంకా కొన్ని కారణాల వల్ల నక్సలైట్లు పుట్టడం జరిగింది. ప్రస్తుతం ఆలా లేదు, కాలం మారింది, ప్రజలు లగ్జరీకి అలవాటు పడ్డారు, కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చాయి. నక్సలైట్ ఉద్యమం దాదాపు బలహీన పడింది. నక్సలైట్ అనే పదం తెలంగాణాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దాదాపు లేకుండా పోయింది. .
ఒక్క నక్సలైట్ లే కాదు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీలు కూడా కూడా బలహీన పడ్డారు.
ఇటీవల హైదరాబాద్లోని సరూర్ నగర్లో చోటు చేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.
No Internet connection |