Wednesday, 25 Oct, 3.44 am ఈనాడు

విశాఖ
తెలుగు కార్టూనోత్సవానికి అంబటి


నాతవరం, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో ఈనెల 28 నుంచి నిర్వహించనున్న తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు జిల్లాకు చెందిన అంబటి చంటిబాబుకు ఆహ్వానం వచ్చింది. ఈయన నాతవరం మండలం చమ్మచింత ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చెట్లను నరకొద్దంటూ వానరులు మానవుని వేడుకొంటున్న కార్టూన్‌ ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా 120 మంది తెలుగు కార్టూనిస్టులు తమ కళ ద్వారా ప్రజల్ని చైతన్యపరిచే ఈవేదికలో గ్రామీణ జిల్లా నుంచి చంటిబాబుకు అవకాశం లభించింది. కొన్నేళ్లగా ఇతను గీస్తున్న కార్టూన్లకు జాతీయస్థాయిలో ఆదరణ లభించింది. మంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌ నిర్వహించే ప్రదర్శనకు హాజరవుతున్నట్టు చంటిబాబు తెలిపారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top