నేటి వధువు తన వివాహ వేడుకలలో తనకు ఏమి కావాలో నిర్ణయించుకోవడంతో ఎంతో స్పష్టంగా ఉంటుంది. విద్య, వృత్తి ఆమెలోని స్వాతంత్య్ర భావాలు తన నిర్ణయాలను తానే స్వయంగా తీసుకునేలా ప్రేరేపిస్తాయి. సంప్రదాయాలు, ఆచారాలు, పద్దతులకు విలువ ఇస్తుంది, అలాగే వాటిని ప్రశ్నించే ధైర్యం కూడా కలిగి ఉంటుంది, అంతేగాని వాటిని గుడ్డిగా అనుసరించదు. ఆమె తన జీవితభాగస్వామి నుండి సమాన హక్కులను కోరుకుంటుంది, అలాగే విస్తరించిన తన సొంత కుటుంబం, అత్తమామల నుండి సహాయసహకారాలను ఆశిస్తుంది. తన భర్త, అత్తమామలతో తన బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో తనకు సహాయపడిన అనుభవాలు ఆమెకు ఎన్నో కలవు. నిజానికి ఈ అనుభవాలు ఆమె కొత్త జీవితం ఎలా ముందుకు సాగాలో తెలియచేస్తాయి.
ఈ అరుదైన క్షణాలు ఏంతో విలువైనవి, ప్లాటినంలా అమూల్యమైనవి.
ప్రకృతిలోని అనేక కోణాల నుండి ప్రేరణ పొందిన Platinum Evara వారి సరికొత్త సేకరణ ఆమె జీవితానికి అద్భుతమైన వైభవాన్ని తెచ్చిపెట్టింది. నూతన వధువు కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ అరుదైన సేకరణతో ఆమె జీవితంలో జరిగిన మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేదు. ఆమె తన First Evaraను ఎన్నటికీ మరువదు.
వివాహమైన తరువాత తమ అరుదైన క్షణాలను మాతో పంచుకున్న నేటితరం వధువుల మధురానుభూతులు మీకోసం.
27 ఏళ్ళ మీరా కొత్త కోడలిగా అడుగుపెట్టిన మొదటి రోజు తన కలలను నెరవేర్చుకోవడానికి అని నమ్ముతుంది - " ఒక రోజు సాయంత్రం నేను కార్యాలయం నుండి తిరిగి వచ్చేసరికి మా వదిన నిరాశగా కనిపించింది. ఒక కప్పు టీ తాగిన తరువాత అను థియేటర్ పట్ల తనకున్న మక్కువను అన్వేషించడానికి తన బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తన మనసులో మాటను బయటపెట్టింది; ఉద్యోగం వదిలేస్తే అందరూ ఏమంటారో అని భయపడుతున్నట్లు తెలిపింది." మీరా మొదటి క్షణాల గురించి చెబుతూ తన మనసులోని భయాలను వదిలేయమని అనుని సున్నితంగా ప్రోత్సహించి, ఆమెను మొదటి ఆడిషన్ కు తీసుకువెళ్లి, ఆమె తొలి అడుగులకు శ్రీకారం చుట్టింది. మీరా చెప్పినట్లుగానే " అను ఆడిషన్ లో ఎంపికైనప్పుడు నేను గట్టిగా చప్పట్లు కొట్టాను, ఇక ఇప్పుడు ఆమె తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది!" ఆక్షణంలో ఆమె తన హారాన్ని సున్నితంగా తాకింది, " ఆమెకు తోడుగా నిలిచినందుకు #MyFirstEvara ను అను నాకు బహుమతిగా ఇచ్చింది. ఈ హారం మేము నిజమైన అక్కాచెల్లెళ్లలా ఎలా మారామో ఎప్పటికీ గుర్తుచేస్తుంది.

32 ఏళ్ళ మాయాకు తన #MyFirstEvara అయిన Platinum Evara సెట్‌తో భావోద్వేగభరితమైన బంధం ఉంది; ఎందుకంటే తన పెళ్ళికి రెండు రోజుల ముందు ఆమె తండ్రి ఆమెకు ప్రేమగా అందించిన కానుక. ఆమె తన భావాలను తన కళ్ళలో ప్రతిబింబించేలా ఇలా చెబుతుంది: " మా నాన్న ఈ అందమైన బహుమతిని తన అప్పగింతల సమయంలో ఇవ్వాలనుకున్నారు, కానీ ఆయన నేను వారికి దూరంగా వెళ్లడంలేదని అర్ధం చేసుకున్నట్లు నేను గ్రహించాను. ఇక్కడ ఎప్పటికీ వీడ్కోలు అనేది ఉండకూడదు! నేను ఎక్కడ ఉన్నప్పటికీ, ఆయన కూతురిగానే ఉంటూ వారి కోసం నిలబడతాను. నేను వారితో కలిసి ఒక ఉమ్మడి ఖాతాను తెరిచినట్లు, దాంతో వారు తన ఫోటోగ్రఫీ పాఠాలను కావలసినప్పుడు తీసుకోవచ్చునని, అంతేకాక నేను వారికి వ్యాపారంలో సహాయపడతానని చెప్పాను. వారు దీనిని ప్రారంభించి 6 నెలలు గడిచింది, మేము ఇప్పటికే వారి మొదటి ప్రదర్శనను నిర్వహిస్తున్నాము. నేను టి కోసం ప్రతీదీ సిద్ధం చేశాను, ఎందుకంటే నేను నియమించబడిన ఒక కోశాధికారిని. నేను వారి ఎగ్జిబిషన్ లో #MyFirstEvara నెక్లెస్ ను ధరించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెళ్లి అనేది ఏ బంధంలోనైనా- ముఖ్యంగా నాకు వారికి మధ్య ఉన్న బంధంలో ఎటువంటి మార్పు తీసుకురాదని నాకు, వారికి గుర్తుచేస్తుంది.

29 ఏళ్ళ ఆయేషా స్ఫూర్తిదాయకమైన తన కథను ఇలా చెబుతుంది. " మా మరిది నీల్ మా ఇంటిలో అందరికీ చిన్న పాపాయి! ఇంతకుముందెన్నడూ ఇల్లు విడిచి వెళ్లని అతడు మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు అతడిలో తెలియని భయం, తల్లి తండ్రుల వద్ద నుండి ఆర్థిక సహాయం పొందాలనే ఆలోచన అతడిని మరింత ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో మేము మాట్లాడినప్పుడు, నేను అతడిలో విశ్వాసాన్ని నింపుతూ, ఒక సలహాదారుడిగా... ఒక అక్కగా అతడికి అండగా నిలిచానని అనుకుంటున్నాను!" కుటుంబాన్నంతటినీ ఒకచోట కూర్చోపెట్టి నీల్ తన ప్రణాళికల గురించి చెప్పేలా ప్రోత్సహించిన తీరుని నేను ఇప్పటికీ గుర్తుచేసుకుంటాను." నేను కళాశాలకు వెళ్ళడానికి ఇంటినుండి బయలుదేరిన క్షణాలలో నా అనుభవాల నుండి నేను తీసుకున్న ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. చదవడం, పనిచేయడం అనేవి ఎంత ముఖ్యమైన విషయాలో, చదువుకుంటూ సంపాదించడం వలన ఆర్ధిక ఇబ్బందులను ఎలా అధికమించవచ్చో అతడికి వివరించాను. అతడు గత వారం ఇంటికి వచ్చినప్పుడు నాకు "ఈ ప్లాటినం బ్రాస్లెట్ - #MyFirstEvara" ను బహుమతిగా ఇచ్చాడు. "తన తల్లితండ్రులకు ఆర్ధిక భారం కాకుండా తను ఎలా సహాయపడగలడో నేను తనకి సలహా ఇవ్వడం వలనే ఇదంతా సాధ్యమైనట్లు" అతడు నాకు చెప్పాడు. ఇవే మా మధ్య అక్కా తమ్ముళ్ళ బంధం ఏర్పడిన మొదటి క్షణాలు.

28 ఏళ్ళ తార తన అత్తగారితో తనకున్న బంధం గురించి హృదయాన్ని కదిలించే తన కథను పంచుకుంటుంది. " మేము చేసిన మొదటి కుటుంబ విందు నాకు గుర్తుంది- ఆరోజు మా అత్తగారు మినహా మేమందరం ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నాం". మేమందరం తింటుండగా మా అత్తగారు వేడివేడి చపాతీలను అందరికీ వడ్డించారు. అందరూ తిని లేచి వెళ్లిపోయారు, ఆ తరువాత మా అత్తగారు కూర్చుని తనకుతానే వడ్డించుకుంటూ ఒంటరిగా తినడం చూశాను. నేను వారి పక్కనే కూర్చుని ఇలా ప్రతిరోజూ జరుగుతుందా లేదా ఈరోజు మాత్రమేనా అని అడిగాను. అప్పుడు ఆమె నవ్వుతూ -" ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది" అని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా చెప్పింది. నేను ఇది చాలా తప్పుకదా అని భావించాను. ఆ మరుసటి రోజు వేడివేడి చపాతీలను ముందే చేసి భోజనం టేబుల్ పై పెట్టి, అత్తగారికోసం ఒక ప్లేట్ ను కూడా పెట్టాను. ఇలా చేయడం నా కుటుంబాన్ని ఆశ్చర్యపరచించి, అయినప్పటికీ వారు నా ఉద్దేశాన్ని అర్థంచేసుకుంటారని భావించాను. నేను మా అత్తగారిని కూర్చోమని చెప్పినప్పుడు ఆమె వంటగదిలోకి వెళ్లడం గమనించాను. ఆవిడ కూర్చోవడానికి మొదట సంశయించారు, అయితే మనం మన స్థానాలను మార్చుకున్నట్లు - ఆవిడ తప్పక కూర్చోవాలని చెబుతూ ఒక సైగ చేశాను. ఆ తరువాతిరోజు అత్తగారు నన్ను తన గదికి పిలిచి అందమైన ఈ Platinum Evara సెట్ - #MyFirstEvaraను బహుమతిగా ఇచ్చి, " నాకు కోడలి రూపంలో ఒక మంచి స్నేహితురాలు దొరికింది" అని చెప్పారు. ఆ క్షణం మేము నిజంగా తల్లీకూతుర్లు అని అనిపించింది.