Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ వాసులకు శుభవార్త: వాట్సాప్‌లోనే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త: వాట్సాప్‌లోనే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 21,2026:
హైదరాబాద్ మహా నగరంలో అద్దె గదుల్లో ఉంటూ సొంతింటి కోసం ఎదురుచూసే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన 'ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని' సిటీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది.

నగరంలో నిర్మాణ లక్ష్యాలు ఇలా..

హైదరాబాద్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పేదలకు ఈ పథకం కింద ఇళ్లను కేటాయించనున్నారు.

మొదటి విడత కేటాయింపులు..

తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో (ఒక్కో చోట 480 చొప్పున) 7,680 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో స్థలాలను గుర్తించి పనులు ప్రారంభిస్తారు.

టార్గెట్..

ఈ ఆర్థిక సంవత్సరంలోనే నగరంలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించి, అర్హులకు అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

అపార్ట్‌మెంట్ తరహాలో ఫ్లాట్లు..నిధుల వివరాలు..

నగరంలో స్థలాల కొరత ఉండటంతో బహుళ అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించి లబ్ధిదారులకు అందిస్తారు. ఈ ఇళ్లను భవిష్యత్తులో ఇతరులకు అమ్ముకునే హక్కు ఉండదు.

సబ్సిడీ, లబ్ధిదారుడి వాటా..

ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుండగా.. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు భరించాలి.

డబ్బులు ఎప్పుడెప్పుడు కట్టాలి..?

 ఇల్లు కేటాయించినప్పుడు రూ.లక్ష, స్లాబ్ (RCC) పోసే సమయంలో రూ.2 లక్షలు, పనులు ముగింపు దశలో ఉన్నప్పుడు రూ.2 లక్షలు.. ఫ్లాట్ కీస్ అప్పగించే ముందు మిగతా సొమ్మును విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

అప్లై చేయడం ఎలా..? ఫీజులు ఎంత..?

అర్హులైన వారు ఆగస్టు 10వ తేదీలోగా తమ ఆధార్ కార్డు, ఇతర ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం మీ నియోజకవర్గం పరిధిలోని మీ-సేవా కేంద్రాలకు వెళ్లి కానీ, లేదా మీ-సేవ వెబ్‌సైట్ ద్వారా కానీ అప్లై చేయవచ్చు.

వాట్సాప్ నంబర్: స్మార్ట్‌ఫోన్ ద్వారా 80969 58096 వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా అత్యంత సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజుల వివరాలు: దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి (ఇది తిరిగి ఇవ్వరు). అలాగే టోకెన్ అడ్వాన్స్‌గా రూ.10 వేలు కట్టాలి. అధికారుల పరిశీలన తర్వాత మీకు ఇల్లు మంజూరు కాకపోతే, ఈ పదివేలు పూర్తిగా వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ ఇల్లు వస్తే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటా కింద జమ చేసుకుంటారు.

ఇల్లు రావాలంటే అర్హతలు ఏంటి..?

దరఖాస్తుదారులు గ్రేటర్ లేదా క్యూఆర్ (ORR) పరిధిలో కచ్చితంగా పదేళ్లుగా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. సొంత ఇల్లు గానీ, ఫ్లాట్/ప్లాట్ గానీ కలిగి ఉండకూడదు. గతంలో ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొంది ఉండరాదు. ప్రస్తుతం మీరు ఏ నియోజకవర్గంలో నివసిస్తున్నారో, ఆ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: 365Telugu online News