Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాస్వామ్యానికి సోషల్‌ మీడియా ముప్పుగా మారుతోందా..?..ప్యూ రీసెర్చ్‌ తాజా సర్వేలో కీలక విషయాలు..

ప్రజాస్వామ్యానికి సోషల్‌ మీడియా ముప్పుగా మారుతోందా..?..ప్యూ రీసెర్చ్‌ తాజా సర్వేలో కీలక విషయాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వాషింగ్టన్‌, అక్టోబర్ 5,2026 : ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవానికి వేదికగా నిలుస్తున్న సామాజిక మాధ్యమాలు ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు చేటు తెస్తున్నాయా? ఈ అంశంపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ 37 దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 శాతం మంది ప్రజలు సోషల్ మీడియా వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతోందని అభిప్రాయపడగా, 55 శాతం మంది మాత్రం ఇది పౌరులను చైతన్యవంతం చేయడంతో పాటు రాజకీయ ప్రక్రియల్లో గళం విప్పేందుకు తోడ్పడుతోందని భావిస్తున్నారు.

ధనిక దేశాల్లో పెరిగిన ఆందోళన
అభివృద్ధి చెందిన, అధిక ఆదాయ వర్గ దేశాల్లో సామాజిక మాధ్యమాల ప్రభావంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లోని మెజారిటీ ప్రజలు సోషల్‌ మీడియా సమాజంలో విభజనను పెంచి, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో 64 శాతం మంది వయోజనులు దీనిని ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తేల్చిచెప్పారు.

భారత్‌లో సానుకూల దృక్పథం
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. దేశంలోని 66 శాతం మంది ప్రజలు సామాజిక మాధ్యమాలను ప్రజాస్వామ్యానికి మేలు చేసే వేదికలుగానే పరిగణిస్తున్నారు. పౌర అవగాహన పెంపొందించడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, సామాన్యుడి గళాన్ని వినిపించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని భారతీయ నెటిజన్లు భావిస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: 365Telugu online News