Wednesday, 05 Aug, 9.50 am 99తెలుగు

హోమ్
ఐపిఎల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ ఔట్

ఐపిఎల్… కరోనా కారణంగా ఇప్పటివరకు జరగని ఈ సంవత్సరం సీజన్. ఇప్పుడు యూఏఈ లో జరుగనుంది. కాగా ఐపిఎల్ కు గత నాలుగు సంవత్సరాలుగా స్పాన్సర్ గా ఉన్న వివో ఇప్పుడు స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం చైనా మరియు భారత్ మద్య నెలకొన్న పరిస్థితులు. చైనా మన భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ఘటన భారత ప్రజల గుండెల్లో ఇంకా పచ్చి గానే ఉంది. దీనికి కాను చైనా వస్తువులను బ్యాన్ చేయాలని దేశం మొత్తం ముఖ్త కంఠంతో నిరసించడం వలన ఇప్పుడు ఈ సెగ ఐపిఎల్ స్పాన్సర్ వివో కు కూడా తగిలింది. చైనా స్పాన్సర్ షిప్ తో ఇప్పుడు క్రికెట్ సీజన్ ఎలా నడుపుతారు. ఇప్పుడు భారత్ లో కరోనా విజృంభిస్తుంటే ఆ వైరస్ వచ్చిన చైనా స్పాన్సర్ లతో వేరే దేశంలో ఇప్పుడు ఆటలు ఆడవలసిన అవసారం ఎంత వరకు ఉంది అని ప్రశ్నించిన భారత యువత నిరసనలకు వివో భయపడినట్టు తెలుస్తుంది. అందుకే స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: 99 Telugu
Top