Sunday, 20 Sep, 12.02 pm 99తెలుగు

హోమ్
పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయబోయాడని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

‘అనురాగ్‌ కశ్యప్ నన్ను బలవంతం చేశాడు నరేంద్ర మోదీజీ ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి అని ట్విట్టర్ ద్వారా కోరింది పాయల్‌. అయితే కంగనాకు, అనురాగ్ కశ్యప్‌కు మధ్య జరుగుతున్న వివాదంలో పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై స్పందించిన అనురాగ్. నా నోరుని మూసివేసే ప్రయత్నం బాగానే జరుగుతుంది.ఇందుకు కొంత సమయం పట్టింది. నా నోరు మూసివేయించే ప్రయత్నంలో చాలా మంది మహిళలను లాగారు. కొంత కంట్రోల్‌గా ఉండండి. ఆధారాలు లేని కామెంట్స్ చేయకండి అని అనురాగ్ కామెంట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: 99 Telugu
Top