Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ABP దేశం 3 months ago

Sumanth's Newton's 3rd Law Movie Review In Telugu: సుమంత్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా'. రాజేష్ కర్ణ దర్శకుడు.

ఈటీవీ విన్, కె హరీష్ సంయుక్తంగా నిర్మించారు. జగపతిబాబు, శ్రీనివాస్ అవసరాల, త్రినాథ్ వర్మ, రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్, నేహా పఠాన్ ప్రధాన పాత్రలు పోషించారు. జూలై 31న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Newton's 3rd Law Story): వినయ్ (త్రినాథ్ వర్మ) అపార్ట్మెంట్ మీద నుంచి కింద పడటంతో మరణిస్తాడు. అతనిది ఆత్మహత్యా? లేదంటే మర్డరా? అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ అధికారి వాసుదేవ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. వినయ్ తలలో బుల్లెట్ ఉందని ఫోరెన్సిక్ రిపోర్టులో తెలుస్తుంది.

బిల్డింగ్ మీద నుంచి కింద పడిన వినయ్ తలలోకి బుల్లెట్ ఎలా వచ్చింది? అది షూట్ చేసింది ఎవరు? వినయ్ తల్లిదండ్రులు (రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్)ను వాసుదేవ్ ప్రశ్నించినప్పుడు తెలిసిన విషయాలు ఏమిటి? సిటీలో టాప్ క్రిమినల్ మెర్క్యూరీ (జగపతి బాబు) నుంచి వినయ్కు ఎందుకు ఫోన్ వచ్చింది? వినయ్ స్నేహితుడు కార్తీక్ (పండిట్ గౌతమ్) ఏం చెప్పాడు? వినయ్ తల్లికి సహుద్యోగి, నర్స్ జ్యోతి (నేహా పఠాన్) రోడ్డు ప్రమాదంలో మరణించడానికి కారణం ఎవరు? కాలేజీ స్టూడెంట్ అయిన వినయ్, క్రిమినల్ మెర్క్యూరీ మధ్య సంబంధం ఏమిటి? చివరకు హంతకుడిని వాసుదేవ్ పట్టుకున్నాడా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ (Newtons 3rd Law Movie Telugu Review): క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నిటిలోనూ కామన్ పాయింట్ ఒక్కటే... ముఖ్యంగా మనిషి మరణం చుట్టూ తీసే సినిమాల్లో, ఎటువంటి క్రైమ్ చేశాడు? ఎవరు చంపారు? అనేది ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసుల పని. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆడియన్స్ను సినిమా అంత ఎంగేజ్ చేస్తుంది. ప్రతి క్రైమ్ థ్రిల్లర్లోనూ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి ఎగ్జైట్ చేసేలా ఉండాలి. అయితే... 'న్యూటన్స్ థర్డ్ లా'లో అటువంటి ఎగ్జైట్ చేసే పాయింట్స్ ఏమీ లేవు.

'న్యూటన్స్ థర్డ్ లా'లో క్రైమ్ థ్రిల్లర్ కథకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ బాండింగ్ వంటివన్నీ ఉన్నాయి. కథలో ట్విస్టులను కూడా బాగా రాసుకున్నారు. కానీ, ఆ ట్విస్టులు వచ్చినప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యే సీన్స్ గానీ, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇంట్రెస్ట్ గానీ కలగదు. స్క్రీన్ ప్లే ఎగ్జైట్ చేయలేదు. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నా... ఏదో ఫ్లాట్గా వెళ్లిన ఫీలింగ్. ఒక్క ట్విస్ట్ అంటే ఒక్క ట్విస్ట్ కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేయలేదు.

రాజేష్ కర్ణ చక్కటి కథ రాసుకున్నా... అంతే చక్కగా సినిమాను తెరకెక్కించడంలో ఫెయిలయ్యారు. డైలాగులు కూడా సోసోగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పరంగా సహజంగా నార్మల్ లైటింగ్లో సినిమా రూపొందించాలని ప్రయత్నించారు. అయితే... ప్రొడక్షన్ పరంగా రాజీ పడినట్టు తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా, షార్ప్గా ఉండాల్సింది. సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి తన వర్క్ పరంగా బెస్ట్ ఇచ్చారు. సాంగ్స్ కంటే ఆర్ఆర్ బాగా చేశారు. కానీ సౌండ్ మిక్సింగ్ సరిగా కుదరలేదు.

వాసుదేవ్ పాత్రకు అవసరమైన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు సుమంత్. జగపతి బాబు కనిపించేది కాసేపే. ఆయన పాత్ర పరిధి తక్కువైనా... ఉన్నంతలో ఉనికి చాటుకున్నారు. ఆయన ఇమేజ్ వల్ల వెంటనే కనెక్ట్ అవుతాం. శ్రీనివాస్ అవసరాల పాత్ర పరిధి కూడా తక్కువే. అయితే... డ్యూయల్ షేడ్ చూపించారు.

రవి వర్మ, షెల్లీ ఎన్ కుమార్ ఎమోషనల్ రోల్స్ చేశారు. నేహా పఠాన్ డ్యూయల్ రోల్ చేశారు. త్రినాథ్ వర్మకు నటుడిగా మంచి పాత్ర లభించింది. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే చూడాలని కోరుకునే నిస్సహాయుడిగా, మరోవైపు నేరాలు చేసే యువకుడిగా పాత్రలో వేరియేషన్స్ చక్కగా చూపించారు. గౌతమ్ పండిట్, రూపేష్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

'న్యూటన్స్ థర్డ్ లా' ఏమిటో తెలుసు కదా... ప్రతి యాక్షన్కు ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. సినిమాకు వచ్చేసరికి... స్క్రీన్ మీద వచ్చే సన్నివేశానికి ఆడియన్స్ నుంచి రియాక్షన్ ఉండాలి. ఎటువంటి యాక్షన్కు అయినా రియాక్షన్ లేదంటే సినిమాకు విజయం లభించడం కష్టం. 'న్యూటన్స్ థర్డ్ లా'కు కూడా అంతే. ఈ సినిమాలో సుమంత్, త్రినాథ్ వర్మ తమ పాత్రలకు న్యాయం చేసినా... దర్శక రచయిత రాజేష్ కర్ణ సినిమాను తెరకెక్కించిన విధానం అసలు ఎగ్జైట్ చేయలేదు. అప్రిషియేట్ చేసేలా లేదు. థియేటర్లలో సినిమా ఆడటం కష్టమే.

Author : Satya Pulagam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam