Dailyhunt
2-Day Oats Diet : ఓట్స్ డైట్ 2 రోజులు ఫాలో అయితే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే, న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

2-Day Oats Diet : ఓట్స్ డైట్ 2 రోజులు ఫాలో అయితే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే, న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

ABP దేశం 1 week ago

Oats Diet and Its Impact on Cholesterol : ఓట్స్​ని చాలామంది తమ డైట్​లో తీసుకుంటారు. ముఖ్యంగా ఫిట్​గా ఉండాలనుకునేవారు వీటిని రెగ్యులర్​గా తింటారు.

బ్రేక్​ఫాస్ట్​గా, ఈవెనింగ్ స్నాక్​గా చాలామంది వీటిని డైట్​లో చేర్చుకుంటార. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఫ్యాట్ కంట్రోల్ అవుతుందని అంటారు. దీనిలో భాగంగానే రెండ్రోజులు కేవలం ఓట్స్ తింటే ఏమవుతుందనే దానిపై అధ్యయనం చేశారు.

పరిశోధనలోని ఇంట్రెస్టింగ్ విషయాలు

యూనివర్సిటీ ఆఫ్ బాన్ కేవలం రెండ్రోజులు ఓట్స్ ఆధారిత డైట్ ఫాలో అయితే ఏమవుతుందనే దానిపై అధ్యయనం చేసింది. ఈ డైట్​ ఫాలో అయితే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని గుర్తించారు. అలాగే ఈ ప్రభావం దాదాపు ఆరు వారాల వరకు కొనసాగుతుందని తెలుసుకున్నారు.

మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్

ఈ అధ్యయనంలో పాల్గొన్న అందరూ మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నారట. అంటే అధిక బరువు, అధిక రక్తపోటు, రక్తంలోని అధిక చక్కెరతో పాటు లిపిడ్ స్థాయిలు ఉన్నవారినే ఎంచుకున్నారట. అధిక కొలెస్ట్రాల్​తో ఇబ్బంది పడేవారు ఈ డైట్​ ఫాలో అయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఓట్స్ ఎలా పని చేస్తాయంటే..

ఓట్​మీల్​లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ అని పిలిచే LDL కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ దీపాలి శర్మ ప్రకారం.. ఓట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఓట్స్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని ఫైబర్ ఎక్కవసేపు కడుపు నిండేలా చేస్తుంది. దీంతో మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఓట్స్లోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా క్రమంగా విడుదలవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే దీనిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఎలాంటి ఓట్స్ ఎంచుకుంటే మంచిదంటే

స్టీల్-కట్ ఓట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంటుంది. రోల్డ్ ఓట్స్ సాధారణంగా వాడే రకం. ఇవి మృదువైన ఆకృతితో ఎక్కువ ద్రవాన్ని పీల్చుకుంటాయి. ఇన్స్టంట్ ఓట్స్ ఈజీగా చేసుకోవచ్చు. బిజీ లైఫ్​స్టైల్​ ఉండేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు ఓట్స్ డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam