Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్

Actress Regena Cassandrra: గుర్రాన్ని పెంచుకుంటున్న రెజీనా.. మీకు కావాలంటే చెప్పండంటున్న హీరోయిన్

ABP దేశం 1 week ago

 యాక్టర్ Regena Cassandrra తాజాగా గుర్రంతో ఉన్న ఫోటోలో కనిపించారు. అయితే అది కేవలం ఫోటో కోసం మాత్రమే కాదు.. ఆ గుర్రాన్ని రెజీనా దత్తత తీసుకుంది.

 జంతువులను రక్షించడం, వాటికి ప్రేమతో కూడిన కొత్త జీవితాన్ని ఇవ్వడం తన చిన్ననాటి నుంచే అలవాటని రెజీనా చెప్పింది. తన ఇంట్లో ఎన్నో పెంపుడు జంతువులున్నాయని.. పిల్లులు ఉడతలతో ఇళ్లంతా నిండిపోయి ఉంటుందని.. ఇప్పుడు గుర్రాన్ని తీసుకొచ్చి ఇంకో అడుగు వేశానని రెజీనా చెప్పింది. ..

ఇప్పటి వరకు ఎన్నో జంతువులను చూసుకున్నా.. గుర్రాన్ని దత్తత తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి అని తెలిపింది. తన జీవితంలోకి వచ్చిన కొత్త గుర్రానికి 'మిల్టన్ కీన్స్' అని పేరు పెట్టిన రెజీనా.. అది ఇప్పటికే ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పింది.

ఈ అవకాశం కల్పించిన Race 2 Win Foundationకు రెజీనా కృతజ్ఞతలు తెలిపింది. తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని పేర్కొంది. మీరు గుర్రాన్ని దత్తతతీసుకోవాలంటే ఇది మంచి అవకాశం అని కూడా అభిమానులకు సూచించింది.

జంతు ప్రేమికులు, అభిమానులు రెజీనా నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam