Dailyhunt
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!

Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!

ABP దేశం 1 week ago

Adilabad Latest News: తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ , పదో తరగతి తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి కోసం ప్రత్యేక క్లాస్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఏ సబ్జెక్ట్ తప్పారో దానిపై వారికి ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖాధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణ వెల్లడించారు.

ఫెయిల్ విద్యార్థులకు కోచింగ్తోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని యోగిత రాణ అన్నారు. గురువారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అకాడమిక్ ప్యానెల్ విజిత్, ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతుల కల్పన అధార్/అపార్ యూ డ్రెయిన్ పురోగతి బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణ పురోగతి కస్తూరిబా గాంధీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఎస్ ఎస్ సి, ఇంటర్ తప్పిన విద్యార్థులకు కోచింగ్, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా విద్యా శాఖ వారోత్సవాలు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కాన్ఫరెన్స్, కార్యక్రమానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యువరాజ్ మార్మట్తో కలిసి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. ఈ డబ్ల్యు ఐడిసి ఇంజినీరింగ్ అధ్వర్యంలో పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 88 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు.

ప్రీ ప్రైమరీ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీకి కోసం కోచింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను మే 11 నుంచి పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. వారోత్సవాలలో భాగంగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతుల పనులు చేపడతామన్నారు. విద్యార్థులకు కోచింగ్ ఏర్పాటు చేయడం సర్పంచ్, కౌన్సిలర్లతో వర్క్ షాప్ నిర్వహించడం జయశంకర్ బడి బాట కార్యక్రమాలను పకడ్బందీగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author : Shailender

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam