Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను ఖరారు చేసిన గుజరాత్ హైకోర్టు

Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను ఖరారు చేసిన గుజరాత్ హైకోర్టు

ABP దేశం 4 months ago

అహ్మదాబాద్: గుజరాత్లో సంచలనం రేపిన అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 18 ఏళ్ల కిందట జరిగిన పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 38 మంది ఉగ్రవాదుల ఉరిశిక్షను సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.

గతంలో ప్రత్యేక కోర్టు దోషులకు ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఆ తీర్పును తాజాగా హైకోర్టు సమర్థించింది.

2008 జూలై 26న జరిగిన ఈ ఉగ్రవాద కుట్రలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో డెత్ రిఫరెన్స్ (ఉరిశిక్ష ధ్రువీకరణ), అప్పీళ్లపై హైకోర్టు తన తీర్పును వెలువరించింది. 2022 సంవత్సరంలో ప్రత్యేక కోర్టు 38 మంది ఉగ్రవాదులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam