Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Alelle Alelle Song Lyrics - 'అలెల్లె అలెల్లె' లిరిక్స్... ట్రెండింగ్‌లో 'శ్రీనివాస మంగాపురం'లో సాంగ్ - జీవీ సంగీతంలో శ్రీమణి ఏం రాశారంటే?

Alelle Alelle Song Lyrics - 'అలెల్లె అలెల్లె' లిరిక్స్... ట్రెండింగ్‌లో 'శ్రీనివాస మంగాపురం'లో సాంగ్ - జీవీ సంగీతంలో శ్రీమణి ఏం రాశారంటే?

ABP దేశం 1 month ago

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబుకు అన్నయ్య అయినటువంటి రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ సినిమాలోని 'అలెల్లే అలెల్లే...'ను తాజాగా విడుదల చేశారు.

నాని విడుదల చేసిన అలెల్లే అలెల్లే
'శ్రీనివాస మంగాపురం' సినిమాను అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులోని మొదటి పాట 'అలెల్లే అలెల్లే...'ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. మెలోడియస్‌గా మొదలై... తర్వాత ఉత్సాహభరితంగా మారిన ఈ పాటను శ్రీమణి రాశారు. ఒక్కసారి సాహిత్యం ఎలా ఉంది? అనేది చూస్తే...

ఈ హృదయం.. చూడదే.. చీకటిని..
నీ చెలిమి చేరదని.. నా ఊపిరి..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే..

పీల్చే శ్వాసలాగా.. మార్చుకోరా నన్నిలా
కాలం చివరి దాకా.. నడిచి రానా తోడులా
ఆటంబాంబు తాకినా చెక్కుచెదరని హృదయం నాదంటా
నాటు తూటాలా ఉండేవాడినే తేనే ఊటల్లా మార్చావంటా
చచ్చిపుడుతున్నా ఇకపైన ప్రాణంగా అడుగిడినా
ఇకపై నీతోనే జీనా మర్నా..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే

రాయిలో.. హాయికి..
రేయిలో.. రంగుకి..
ప్రాణమే.. నీ ప్రేమని..
ఈ రాయిని మల్చేశావులే..
ఈ రేయిని వెలిగించావులే..
నీ రూపమే నాలో నింపేశావులే..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..

కల్లలో నీరులే..
రాదుగా నిద్దురే
ఓ క్షణం నిను వీడితే..
ఆ నీరుని కాల్చేస్తానులే..
నిదురని నరికేస్తానులే..
నీ జంటనే వీడే క్షణం నా ఊపిరి ఆగులే..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే..

Also Read: Kara Review In Telugu - ధనుష్ 'కర' రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… సినిమా ఎలా ఉందంటే?

శ్రీమణి సాహిత్యంలోని ప్రేమ, మధురమైన అనుభూతులను జీవీ ప్రకాష్ కుమార్ బాణీ, అలాగే ఆయనతో పాటు హరి ప్రియా గానం చక్కగా ఆవిష్కరించింది. ఈ పాటకు సింగింగ్ కూడా హైలైట్ గా నిలిచింది. జయకృష్ణ, రషా మధ్య కెమిస్ట్రీ ఎంతో సహజంగా, అందంగా ఉంది.

ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలెక్షన్ కింగ్, లెజెండరీ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణ ISC సినిమాటోగ్రాఫర్.

Also Read: Ashu Reddy - కేసుతో అషురెడ్డి ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam