Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - వైసీపీపై అలీ రియాక్షన్

Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - వైసీపీపై అలీ రియాక్షన్

ABP దేశం 4 days ago

Actor Ali Opens Up About His Political Career : సరికొత్త అడ్వెంచరస్ ట్రావెల్ టాక్ షో 'సోల్ ట్రిప్'. ఈ షోకు విజయ్ దాట్ల హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పటివరకూ...

జగపతిబాబు, వర్ష బొల్లమ్మ, శ్రీకాంత్, ఆకాష్ పూరిలను డిఫరెంట్ ప్లేసెస్‌లో ఇంటర్వ్యూ చేశారు. ట్రావెలింగ్‌లో నేచర్ ఎంజాయ్ చేస్తూ... సెలబ్రిటీలు సినీ కెరీర్‌తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలు, వారి ఆలోచనలు, అభిరుచులను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా కమెడియన్, హీరో అలీ ఈ షోలో పాల్గొన్నారు.

పొలిటికల్‌గా వాడుకున్నారా?

ట్రావెలింగ్ జర్నీలో సినీ కెరీర్‌తో పాటు తన పొలిటికల్ ఎంట్రీ, డ్రాప్ కావడంపైనా మాట్లాడారు. 'నేను పాలిటిక్స్‌లోకి రావాలని అనుకోలేదు. అలా అని రికగ్నైజ్ చేయకుండా ఐదేళ్లకు ఒకసారి వాడుకుని వదిలేస్తే ఎలా ఉంటుంది?.' అని ప్రశ్నించారు. 2019లో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీ 'ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా' నియమితులయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆయనకు సీటు దక్కలేదు. పార్టీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అందువల్లే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత అలీపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం కూడా సాగింది. 2024 జూన్ చివర్లో ఆయన తన పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పారు.

Also Read : 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

'ఆస్తి రాయించుకుంటావా అన్నారు'

నేచర్ ఎంజాయ్ చేస్తూనే తన సినీ కెరీర్ విషయాలు షేర్ చేసుకున్నారు అలీ. తాను గోదారి పక్కనే పెరిగినా ఈత రాదని అన్నారు. ఇంట్లో ఫుడ్ ఎంజాయ్ చేశారు. 'నేను అల్లు రామలింగయ్య కొడుకుగా ఓ 20 సినిమాలు చేసుంటా సార్ అని అరవింద్ గారితో ఓ సందర్భంలో చెప్పా. ఆయన సరదాగా మా ఆస్తిలో వాటాకొచ్చావా? అని అడిగారు.' అంటూ నవ్వులు పూయించారు.

Also Read : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam