ముంబై: భారత్తో పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. వ్యాపార ప్రకటనలతో పాటు తమ విలాసవంతమైన లైఫ్స్టైల్తో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు.
ముంబైలోని వారి నివాసం అయిన 'యాంటిలియా'లో 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కార్లు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కార్లు ఉన్నాయి.
కార్ కలెక్షన్లో ఏయే ఖరీదైన కార్లు ఉన్నాయంటే..
ముఖేష్ అంబానీ కుటుంబంలోని అత్యంత ఖరీదైన కార్లలో 'బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) తొలి స్థానంలో ఉంటుంది. ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 17 కోట్లు ఉంటుందని సమాచారం. సేఫ్టీతో పాటు లగ్జరీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారును వారికి తగ్గట్లుగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. వారి వద్ద మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ కూడా ఉంది. ఇది ఆ ఫ్యామిలీ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ఒకటి. ఈ కారు ధర సుమారు రూ.15 కోట్లు.
నీతా అంబానీ, ఆకాష్ అంబానీ వద్ద కార్ల కలెక్షన్
నీతా అంబానీ వద్ద 'రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఎక్స్టెండెడ్ వీల్బేస్' వంటి లగ్జరీ కారు ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 14 కోట్లు ఉంటుంది. రిలయన్స్ డైరెక్టర్లలో ఒకరైన అనంత్ అంబానీ వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉంది. ఈ కారు ధర దాదాపు 14 కోట్లు ఉంటుంది. వీటితో పాటు అంబానీ ఫ్యామిలీ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎక్స్టెండెడ్ వీల్బేస్ కూడా ఉంది. ఈ కారు ధర 13 కోట్ల రూపాయలు పైమాటే.
అంబానీ కుటుంబం కేవలం రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ కార్లను కూడా లైక్ చేస్తారు. వీరి వద్ద ఫెరారీ పురోసాంగ్వే (Ferrari Purosangue) వంటి లగ్జరీ SUV ఉంది. దీని ధర 12 కోట్ల రూపాయలు. ఆకాష్ అంబానీ తరచుగా ఈ కారును నడుపుతూ కనిపిస్తుంటారు. దీంతో పాటు ఫెరారీ SF90 స్ట్రాడేల్ వంటి సూపర్ కార్ కూడా అంబానీల కార్ కలెక్షన్లో ఉంది. ఈ కారు హై స్పీడ్తో దూసుకెళ్తోంది. ఈ ఫెరారీలో మోడ్రన్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ కోసం అంబానీల వద్ద ఉన్న కార్లు
కుబేరులు కావడంతో వారి సెక్యూరిటీ అనేది సవాలుతో కూడుకుని ఉంటుంది. సేఫ్టీ కోసం వారి వద్ద అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్, BMW 760Li హై సెక్యూరిటీ వంటి కార్లను వాడతారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, చాలా హై-లెవల్ సెక్యూరిటీ ఫీచర్లు ఈ కార్లలో ఉంటాయి. వీటి ధర కూడా రూ. 9 నుంచి 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. వీరితో ఇంకా 'రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II' అల్ట్రా లగ్జరీ SUV ఉంది. ఈ కారు ధర 10 కోట్ల కంటే ఎక్కువ. కాగా, అంబానీ ఫ్యామిలీ తమ అవసరాలు, అభిరుచికి తగ్గట్లుగా కార్లను జజజజజజదకస్టమైజ్ చేయించుకున్నారు.
Author : Shankar Dukanam

