Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ammoru Diginadhi Song Lyrics - 'అమ్మోరు దిగినాది' సాంగ్ లిరిక్స్: 'అనకాపల్లి'లో మంగ్లీ పాట... జాతరలో మార్మోగేలా

Ammoru Diginadhi Song Lyrics - 'అమ్మోరు దిగినాది' సాంగ్ లిరిక్స్: 'అనకాపల్లి'లో మంగ్లీ పాట... జాతరలో మార్మోగేలా

ABP దేశం 1 month ago

ప్రముఖ గాయని మంగ్లీ గొంతులో ఓ మేజిక్ ఉంటుంది. భక్తి గీతాలు, ముఖ్యంగా అమ్మ వారి పాటలు మంగ్లీ పాడితే పూనకాలు రావడం గ్యారెంటీ. ఇటీవల ఆమె పేరు వివాదాల్లో వినిపించింది.

కానీ, కొత్త పాటతో మరోసారి తానేంటో చూపించారు మంగ్లీ. 'అనకాపల్లి' సినిమాలో 'అమ్మోరు దిగినాది...' పాడారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...

అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది...
జై గంటలు మోగేనే.. కర్పూరాలు ఎలిగేనే!
'అనకాపల్లి'లో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ సంస్థలపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. విక్రమ్ సహిదేవ్ సరసన సంధ్య వశిష్ట కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సంగీత సైతం ఉన్నారు. మంగ్లీ పాడిన 'అమ్మోరు దిగినాది...' పాటను సంగీతపై తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. ఒక్కసారి ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...

గణగణగణగణగణగణ జై గంటలు మోగేనే.. కర్పూరాలు ఎలిగేనే..
పొట్టేల్లు వచ్చేనే.. పరమాన్నం వచ్చిందేరే...
వేపా దళముల రక్షా ఊరంతా తిరిగేనే
నాటు తోలు డప్పు వేడుక్కి రేగిందిలే
కుంకాల పోగుంది.. పసుపంటి నేలుంది..
కాగాడాల చమురు కాలుతూ నవ్వింది..
ఘల్లన్నాయి గజ్జెలు.. ఎవరంటూ చూశాము..
చింతానిప్పుల వెనకా నల్లరాతిరి లాగా
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది

Also Read: Kara Review In Telugu - ధనుష్ 'కర' రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… సినిమా ఎలా ఉందంటే?

ప్రాణాన్ని మాకిచ్చి సల్లంగా బతుకంటే అమ్మా..
వెర్రెక్కి పోయామే మదమెక్కి ఆడామే.. కర్మా..
భద్రంగా చూస్తూనే తప్పుంటే దండించే అమ్మా..
నరమేధం చేస్తుంటే.. ఇంకేడా మాకుంది జన్మా..
బెబ్బులెక్కి.. శూలం పట్టి.. దుష్టుల తల.. దాహానికి
బెబ్బులెక్కి..తరిమి తరిమి
శూలం పట్టి.. ఉరిమి ఉరిమి
దుష్టుల తల తురిమి తరుమి దాహానికి నెత్తురడిగి హే..
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది

ఘట్టాలెక్కి ఊరే చుట్టి పూనకమై ఊగినాది..
పుర్రెలన్నీ మాలకట్టి చెడు అంతే చూసినాది..
అయ్యోరిని మూడో కన్ను ఓసారి ఇటు ఇయ్యమని..
దూరంగున్నా భారంగున్నా అందరినీ కాల్చునది..
అడిగడడిగడి పోతురాజు కొరడాలతో నీ అడుగులు పడిపడి
వీరుడన్నా, శూరుడన్నా నీ ముంగిట నిలువరనీ
సోయేలేకా బుద్దే రాక నీ వేటుకి చీలిపడి
ప్రాణం ఉన్నా దేహం అంటే అమ్మోరి దీవెనది
పాహి అన్నా దేహి అన్నా ఈ వేటా ఆగనిది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది (2)

Also Read: Bellamkonda Sai Sreenivas Weds Kavya Photos - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో

'అనకాపల్లి' సినిమాలో జాతర సాంగ్ 'అమ్మోరు దిగినాది...'కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. గణేష్ సలాది లిరిక్స్, దేవజండ్ అందించిన బాణీ శాతం బావుంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా... తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Also Read: Ashu Reddy - కేసుతో అషురెడ్డి ఇన్స్టా సబ్స్క్రిప్షన్కు పెరిగిన డిమాండ్... లక్షల్లో డబ్బులు

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam