హీరోయిన్ అనన్య నాగళ్ల లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ బోర్డ్ వద్ద సందడి చేశారు. మోడ్రన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులివ్వగా ట్రెండ్ అవుతున్నాయి.
డ్రీమ్ అనే క్యాప్షన్ ఇస్తూ అనన్య ఫోటోస్ షేర్ చేయగా...
ఫ్యాన్స్, నెటిజన్లు లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలపై ఇంట్రెస్ట్‌తో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి షార్ట్ ఫిల్మ్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అనన్య. మల్లేశం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య... వకీల్ సాబ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కాయి. మాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీస్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
దీంతో పాటే బహిష్కరణ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. వరుసగా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికా ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.
అనన్య నాగళ్ల హాలీవుడ్ లేటెస్ట్ ఫోటో షూట్ ట్రెండ్ అవుతోంది.

