Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

ABP దేశం 1 month ago

Roja Daughter Anshu: ఏపీ మాజీ మంత్రి, సినీనటి, ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పుడు ఆమె కూతురు అన్షు రోజా సెల్వమణి తల్లికి తగిన కూతురు అనిపించుకున్నారు.

తాను చదువుతున్న యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

ఇండియానా యూనివర్సిటీ నుంచి అత్యున్నత గౌరవం

అమెరికాలోని Indiana University Bloomington లో అన్షు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఆ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే Herman B Wells Distinguished Senior Award 2026కు అన్షు రోజా సెల్వమణి ఎంపికయ్యారు. శనివారం యూనివర్సిటీ ఆ అవార్డు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ రోజా, సెల్వమణి హాజరయ్యారు. కుమార్తె అవార్డు తీసుకుంటున్న క్షణాలను ప్రత్యక్షంగా చూసి ఆనందించారు. ఆ తర్వాత సెలబ్రేషన్ చేశారు.

ఈ అవార్డును యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది ఒక్కరికే ఇచ్చే ఈ అవార్డు…
అకడమిక్ ప్రతిభతో పాటు సమాజంపై ప్రభావం చూపిన నాయకత్వాన్ని గుర్తించి ఇస్తారు.1961లో ప్రారంభమైన ఈ అవార్డు…
యూనివర్సిటీ 11వ ప్రెసిడెంట్ Herman B Wells ఆలోచనలకు ప్రతీక.

చదువులో అద్భుత ప్రతిభ
సమాజంలో ప్రభావవంతమైన సేవ
గ్లోబల్ లెవల్లో నాయకత్వం

ఈ మూడు లక్షణాలు ఉన్న విద్యార్థిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

అన్షుకు అవార్డు ఎందుకంటే..
అన్షు ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్లో బాచిలర్ డిగ్రీ చేస్తూ కాగ్నిటివ్ సైన్స్లో మైనర్ చదువుతోంది. అయితే కేవలం అకడమిక్ కే పరిమితం కావడం కాకుండా నాయకత్వ లక్షణాలు చూపించారు. Binary Horizons అనే ప్రోగ్రామ్ ద్వారా ఆఫ్రికా, ఇండియా వంటి దేశాల్లో డిజిటల్ డివైడ్ తగ్గించే ప్రయత్నం చేశారు. కోడింగ్, డిజిటల్ లిటరసీ ద్వారా వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. నమీబియా, నైజీరియా, జాంబియా దేశాల్లో ప్రాజెక్ట్స్ చేపట్టారు. అన్షు క్యాంపస్లో కూడా యాక్టివ్ లీడర్గా నిలిచింది. క్యాంపస్లో అనేక డిబేట్లు నిర్వహించడంతో పాటు.. Women of IU పాడ్కాస్ట్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి…
సమాజ సమస్యలను పరిష్కరించే ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్స్ రూపొందించాలన్నదే తన విజన్ అని ఆమె చెప్పారు.

తల్లి వారసత్వం...

రోజా సినీ ప్రయాణం తర్వాత రాజకీయాల్లో డైనమిక్ లీడర్గా ఎదిగారు. ఇప్పుడు కుమార్తె కూడా కాలేజీ లెవల్లో గ్లోబల్ లీడర్షిప్ అవార్డు తీసుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Author : ARYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam