Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

ABP దేశం 1 month ago

Apple iPad Mini: ప్రముఖ యాపిల్ కంపెనీ పలు ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హాట్ కేకుల్లా కొనేస్తారు.

ఐఫోన్ను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడినా, Apple ఇతర ఉత్పత్తులు కూడా చాలా మందికి నచ్చుతాయి. ఈ క్రమంలో Apple iPad Mini మార్కెట్లో ఫేమస్ డివైజ్. యాపిల్ కంపెనీ ఇప్పుడు ఈ పరికరాన్ని కొత్త డిస్ప్లేతో మార్కెట్లోకి రావడానికి చేయడానికి సిద్ధమవుతోంది.

మొదటిసారి OLED ప్యానెల్

బ్లూమ్బెర్గ్కు చెందిన మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం Apple కొత్త iPad Mini లాంచ్ చేయడంపై ఫోకస్ చేసింది. దీని అంతర్గత కోడ్నేమ్ J510 అంటారు. ఈ పరికరానికి 2021 తర్వాత ఇది మొదటి పెద్ద అప్డేట్ కానుంది. కొత్త iPad Miniలో OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది ప్రస్తుత LCD స్క్రీన్ కంటే చాలా బెస్ట్గా ఉంటుంది. మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ అప్గ్రేడ్ కాంపాక్ట్ టాబ్లెట్ విభాగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇంతకు ముందు ప్రో మోడల్స్లో OLED టెక్నాలజీ వాడేవారు.

ప్రామాణిక ఐప్యాడ్లో LCD డిస్ప్లే కొనసాగింపు

ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, iPad Mini, iPad Air లలో OLED స్క్రీన్ వస్తుందని హాట్ టాపిక్ అవుతోంది. సాధారణ iPad మోడల్లో ప్రస్తుతం LCD డిస్ప్లే ఇస్తారని తెలిసిందే. డివైజ్ ధరను సాధ్యమైనంత తక్కువ ఉంచడానికి ఇది జరుగుతోంది. దీంతో పాటు, Apple Pencil ను కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని భావిస్తున్నారు. ఈ కొత్త డివైజ్ లో వినియోగదారులు కొత్త టెక్నాలజీని ఆస్వాదిస్తారు.

Oneplus: వన్ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

కొత్త ఐప్యాడ్ విడుదల

Apple కేవలం iPad Miniకి మాత్రమే పరిమితం కాలేదు. కంపెనీ కొత్త ఎంట్రీ లెవల్ iPadపై కూడా వర్క్ చేస్తోంది. యాపిల్ కొత్త ఐపాడ్ త్వరలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త మోడల్లో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా ఇవ్వనున్నారు. దీని వల్ల ఐపాడ్ పనితీరు చాలా మెరుగుపడుతుంది. అయితే, దీని డిజైన్లో గత ఐపాడ్తో పోల్చితే పెద్దగా మార్పులు ఉండవు.

WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam