APSRTC: యాప్లో బుక్ చేసుకుంటే.. ఆటో, క్యాబ్, బైక్ మన ఇంటికే వస్తాయి. అయితే ఇకపై ఆర్టీసీ బుస్ కూడా మన ఇంటి వద్దకే వస్తుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టునుంది.
టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించేలా ఆలోచన చేస్తు్న్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ అధికారిణి వి. నీలిమ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ సదుపాయం మాత్రం విజయవాడ సిటీ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.
ఇంటి వద్దకే బస్సు
ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు కార్యక్రమాన్ని విజయవాడ-హైదరాబాద్ రూటులో ప్రయోగాత్మకంగా టెస్టు చేస్తున్నట్లు నీలిమ తెలిపారు. ప్రయాణికులు ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటే.. ఇంటర్నెట్, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటి వద్దే బస్సు ఎక్కాలనుకున్న వారు ఎక్కాల్సిన ప్రదేశం నుంచి బస్టాండ్కు ఎంత దూరం ఉంటుందో అంత టికెట్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సదుపాయం కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రయాణికులు ఎక్కాల్సిన బస్సు సమయానికి కనీసం నాలుగు గంటల ముందు 73828 25450, 99592 25450 మొబైల్ నెంబర్లను సంప్రదించి వివరాలు అందించాలని నీలిమ తెలిపారు.
Also read: విజయవాడ- అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో సిగ్నేచర్ బ్రిడ్జి.. ఆరు లేన్లతో ప్రతిపాదన
బల్క్ టికెట్లకు ఛాన్స్
సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి బస్సుల్లో టికెట్ బుక్ చేసుకున్నాక, నిర్ణీత సమయం కంటే ముందుగా బస్టాండ్కు చేరుకోవాల్సి ఉండేది. లగేజీతో పాటు సకాలంలో బస్టాండ్కు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. దీనిని గమనించిన ఆర్టీసీ బల్క్గా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల కోసం ఇంటి వద్దే పికప్ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ బస్సులను ప్రయాణికుల ఇంటి వద్దకు పంపి పికప్ చేసుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగర పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే బల్క్గా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ముందుగా ఆ సమాచారాన్ని ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలి.
Also read: క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !
హైకోర్టు బస్సు రూటు మార్పు
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఏపీ హైకోర్టుకు ప్రతి రోజు ఉదయం 9.10 నిమిషాలకు వెళ్లే బస్సు సీడ్ యాక్సిస్ రోడ్డు, సీఆర్డీఏ మీదుగా హైకోర్టును చేరుకునేలా రూటు మార్పు చేశారు. ఉదయం 9.25 నిమిషాలకు ఉండవల్లి సెంటర్ నుంచి వయా పెనుమాక, మందడం మీదుగా హైకోర్టుకు వెళ్లే విధంగా అదనపు ట్రిప్ను సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Author : Satyaprasad Bandaru

