Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ather 450Xలో మూడు కొత్త కలర్ ఆప్షన్లు - మీ టైమ్‌ సేవ్‌ చేసే కొత్త ఛార్జర్‌ కూడా లాంచ్

Ather 450Xలో మూడు కొత్త కలర్ ఆప్షన్లు - మీ టైమ్‌ సేవ్‌ చేసే కొత్త ఛార్జర్‌ కూడా లాంచ్

ABP దేశం 2 weeks ago

Ather 450X overtone series launched: పాపులర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్రాండ్ Ather Energy, తన స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450X కోసం కొత్త Overtone Seriesను లాంచ్‌ చేసింది.

ఈ సిరీస్‌లో మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్ ఎంపికలకు తోడు ఈ కొత్త రంగులు చేరడంతో Ather 450X మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.

డ్యూయల్ టోన్ థీమ్‌
కొత్త Overtone Seriesలో Still White, Space Grey & Lunar Grey రంగులను డ్యూయల్ టోన్ థీమ్‌లో అందించారు. ఈ మూడు కలర్ ఆప్షన్లలో కొత్త గ్రాఫిక్స్‌తో పాటు స్కూటర్ సైడ్ ప్రొఫైల్‌పై ప్రత్యేకంగా కనిపించే '450' లెటరింగ్‌ను కాంట్రాస్టింగ్ షేడ్‌లో అందించారు. దీంతో స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్ వచ్చింది.

Space Grey కలర్ అత్యంత స్టైలిష్‌గా కనిపించే ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో మెరూన్ రంగు యాక్సెంట్లు & అదే రంగులో వీల్స్‌ను అందించారు. Lunar Grey వేరియంట్‌లో లైట్ గ్రే షేడ్‌తో పాటు పసుపు రంగు ఫ్రేమ్ & వీల్స్ ఉన్నాయి. Still White వేరియంట్‌లో తెలుపు రంగుతో పాటు లైట్ గ్రీన్ యాక్సెంట్లు ఇవ్వడం వల్ల ప్రీమియం లుక్ కనిపిస్తుంది.

: పల్సర్ అభిమానులకు షాక్ - బజాజ్ పల్సర్ N125 అమ్మకాలు నిలిపేసిన కంపెనీ, కారణం ఇదే!

161 కిలోమీటర్ల వరకు రేంజ్‌
కొత్త కలర్స్ మినహా స్కూటర్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇప్పటికే ఉన్న పనితీరు, మోటార్ & బ్యాటరీ సెటప్‌ను యథాతథంగా కొనసాగించింది. నగర ప్రయాణాలకు అనువైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్‌తో వేరియంట్‌ను బట్టి 122 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన రేంజ్‌ను అందిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు
Ather 450X ప్రస్తుతం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎక్స్ షోరూమ్ ధరలు సుమారు రూ.1.23 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.1.73 లక్షల మధ్య ఉన్నాయి. బెంగళూరులో Ather 450X ధర రూ.1.52 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త Overtone Seriesతో పాటు కంపెనీ ఇప్పటికే అందిస్తున్న Cosmic Black & True Red మోనో కలర్స్‌ను కూడా కొనసాగిస్తోంది. అలాగే Hyper Sand & Stealth Blue మ్యాట్ ఫినిష్ కలర్ ఆప్షన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద Ather 450X ఇప్పుడు ఎనిమిది ఆకర్షణీయమైన కలర్ ఎంపికల్లో లభిస్తోంది.

: E20 పెట్రోల్ నింపుకుంటే పూర్తి బాధ్యత వాహనదారులదే, సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిందా?

కొత్త 900W ఛార్జర్‌
కొత్త రంగులతో పాటు Ather మరో కీలక అప్‌డేట్‌ను కూడా ప్రకటించింది. కంపెనీ కొత్త 900W ఛార్జర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా Ather 450X ఛార్జింగ్ సమయం దాదాపు 30 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది. దీంతో యూజర్లు తక్కువ సమయంలోనే స్కూటర్‌ను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల నిర్వహించిన Community Day 2025 కార్యక్రమంలో కంపెనీ AtherStack 7ను కూడా పరిచయం చేసింది. ఇందులో భాగంగా 'Voice on Ather' ఫీచర్‌ను OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో వాయిస్ కమాండ్ల ద్వారా స్కూటర్‌లోని పలు ఫీచర్లను మరింత సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Author : Arun Kumar Veera

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam