Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

ABP దేశం 4 months ago

Best Time For Babymoon : ప్రెగ్నెన్సీ తర్వాత దంపతుల జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆసుపత్రి చెకప్లు, పుట్టబోయే బిడ్డ, తల్లికోసం కోసం షాపింగ్, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ బాధ్యతలు..

ఇలా అనేక పనులతో సమయం గడిచిపోతుంది. ఇలాంటి సమయంలో బిడ్డ పుట్టకముందే ఇద్దరూ కలిసి ప్రశాంతంగా కొంత సమయం గడపాలనే ఉద్దేశంతో కొన్ని జంటలు ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అలా వెళ్లే స్పెషల్ విహారయాత్రనే 'బేబీమూన్' అంటారు. విదేశాల్లో చాలా కాలంగా ఉన్న ఈ ట్రెండ్​ను ఇప్పుడు ఇండియాలో కూడా చాలా జంటలు ఫాలో అవుతున్నాయి.

బేబీమూన్

బిడ్డ పుట్టక ముందే.. కాబోయే తల్లిదండ్రులు కలిసి విశ్రాంతి తీసుకునేందుకు, ప్రశాంతంగా కొన్ని రోజులు గడపడానికి చేసే చిన్న ట్రిప్​ని బేబీమూన్ అంటారు. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు.. తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడపడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, బంధాన్ని మరింత బలపరచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెప్తారు.

మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..

బేబీమూన్కు సరైన సమయం

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీలో రెండో త్రైమాసికం అంటే 14 నుంచి 28 వారాల మధ్య ఈ బేబీమూన్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకుంటే ఈ దశలో తొలి నెలల్లో ఉండే వికారం, అలసట తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చివరి నెలల్లో ఉండే అసౌకర్యం కూడా అంతగా ఉండదు కాబట్టి.. ఇదే అనుకూలమైన సమయం. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేయాలా వద్దా అనేది వైద్యుడి సలహా మేరకే డిసైడ్ అవ్వాలి.

బేబీమూన్కు వెళ్తే కలిగే లాభాలు

ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా ట్రిప్​కి వెళ్లడం వల్ల దంపతులకు ఒకరితో ఒకరు ప్రశాంతంగా సమయం గడిపే అవకాశం లభిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడి, ఆందోళన కొంతవరకు తగ్గవచ్చు. తల్లిదండ్రులుగా రాబోయే బాధ్యతలకు ఇద్దరూ కలిసి మానసికంగా సిద్ధమవుతారు. ప్రకృతి మధ్య గడపడం వల్ల విశ్రాంతి, సానుకూల భావనలు పెరుగుతాయి. బిడ్డ రాకముందే, బిడ్డతో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నారా? సంతాన్నాన్ని దూరం చేస్తోన్న అలవాట్లు ఇవే

ఎలాంటి ప్రదేశాలకి వెళ్తే మంచిది?

బేబీమూన్ కోసం దూర ప్రాంతాల కంటే సమీపంలో ఉండే, ప్రశాంతమైన ప్రదేశాలను ఎంచుకోవడం మంచిది. అవసరమైతే ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ ప్రయాణం చేయాల్సిన ప్రదేశాలు లేదా రోజంతా తిరిగే టూర్ ప్లాన్లను చేసుకోకూడదు.

దోమల ద్వారా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉన్న ప్లేస్​లు, అధిక ఎత్తులో ఉండే లోకేషన్లు, తీవ్రమైన వేడి లేదా చలితో కూడిన ప్రాంతాలు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో లేని చోట్లకి వెళ్లకూడదు.

బేబీమూన్​కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు బేబీమూన్​కి వెళ్లాలనుకుంటే వైద్యులు సూచించిన మందులు తీసుకెళ్లాలి. అలాగే గర్భధారణ విటమిన్లు, మెడికల్ రిపోర్ట్స్, సౌకర్యవంతమైన డ్రెస్​లు, పాదాలకు మద్దతు ఇచ్చే చెప్పులు, తేలికపాటి హెల్తీ ఫుడ్స్, తగినంత మంచినీరు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, శరీరాన్ని స్ట్రెచ్ చేయడం మంచిది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam