Bajaj Pulsar NS400Z Price Slashed Due to 18 Percent GST Benefits: బజాజ్ ఆటో తన శక్తివంతమైన ఎన్ఎస్400జెడ్ (NS400Z) మోటార్ సైకిల్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బైక్ ధరను భారీగా తగ్గిస్తూ వాహనదారులకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ) రూ.
1.80 లక్షలకు చేరుకుంది. ఈ ధర తగ్గింపు వెనుక ప్రధాన కారణం జీఎస్టీ (GST) నిబంధనలే. ఈ మోటార్ సైకిల్ పై 18 శాతం జీఎస్టీ మాత్రమే వర్తించడం వల్ల కంపెనీ ఈ భారీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీనివల్ల 40 హెచ్పీ (HP) పవర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత సరసమైన ధర కలిగిన బైక్ గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ ధరలో ఎక్కువ పవర్ కోరుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.
కస్టమర్లకు రూ. 24,500 వరకు ఆదా..
ఈ ధర తగ్గింపు వల్ల కొనుగోలుదారులకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఎక్స్-షోరూమ్ ధర తగ్గడంతో పాటు, ఇన్సూరెన్స్ ప్రీమియం అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయి. వెరసి ఒక కస్టమర్ దాదాపు రూ. 24,500 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 349 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వచ్చే ఈ బైక్, టన్నుకు 247 హెచ్పీ పవర్ టు వెయిట్ రేషియోను అందిస్తుంది. అంటే రైడర్లకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో బైక్ కొనాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
పల్సర్ 180 కమ్బ్యాక్ – క్లాసిక్ లుక్, మోడర్న్ టెక్నాలజీతో బజాజ్ కొత్త మాస్టర్ ప్లాన్!
ఫీచర్ల సునామీ..
ఎన్ఎస్400జెడ్ కేవలం పవర్ లోనే కాదు, ఫీచర్ల లోనూ ఈ సెగ్మెంట్ లో రారాజుగా నిలుస్తోంది. ఇందులో రైడర్ల కోసం 4 రకాల రైడ్ మోడ్స్ ఉన్నాయి. స్మూత్ గా గేర్లు మార్చడానికి క్విక్ షిఫ్టర్, భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు జోడించారు. మెరుగైన గ్రిప్ కోసం రేడియల్ టైర్లు, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కన్సోల్ వంటివి రైడింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. అగ్రెసివ్ లుక్ తో పాటు షార్ప్ హ్యాండ్లింగ్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లోనూ, లాంగ్ రైడ్స్ లోనూ ఈ బైక్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
సేఫ్టీ ఫస్ట్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉన్న చౌకైన బైకుల లిస్ట్ ఇదే!
డెమొక్రటైజింగ్ పర్ఫార్మెన్స్..
బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బజాజ్ పల్సర్ సిరీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండే పర్ఫార్మెన్స్ కు మారుపేరుగా ఉంటుందని, 18 శాతం జీఎస్టీ అడ్వాంటేజ్ తో కస్టమర్ల యాజమాన్య ఖర్చును తగ్గించడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. దీనివల్ల ఎక్కువ మంది రైడర్లు హై పర్ఫార్మెన్స్ బైకులను సొంతం చేసుకోగలుగుతారని, పల్సర్ బ్రాండ్ ను మరింత మందికి చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
180 సీసీ సెగ్మెంట్లో మళ్ళీ మొదలైన పోరు - పల్సర్ రీ-ఎంట్రీతో అపాచీకి చెక్!
ఇండియన్ మార్కెట్లో స్పోర్ట్స్ బైకుల విభాగాన్ని సామాన్యులకు సైతం చేరువ చేయాలనే బజాజ్ వ్యూహం ఈ ధర తగ్గింపుతో స్పష్టమవుతోంది. స్టైల్, పవర్, లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఇప్పుడు తక్కువ ధర కూడా తోడవడంతో ఎన్ఎస్400జెడ్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్ కోసం వెయిట్ చేసే రైడర్లకు ఇదొక గుడ్ న్యూస్.
Author : Ayesha

