Dailyhunt
Balakrishna: బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ... కొరటాల ప్లానింగ్ ఇదేనా?

Balakrishna: బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ... కొరటాల ప్లానింగ్ ఇదేనా?

ABP దేశం 2 days ago

'దేవర' చిత్రం తరువాత కొరటాల శివ టైం ఎంతలా వృథా అయిందో అందరికీ తెలిసిందే. ఆచార్య డిజాస్టర్ అవ్వడం, కొరటాల శివని ఎన్టీఆర్ పిలవడం, దేవర కథ కోసం రంగం సిద్దం చేయించడం, కథ ఎంతకీ సెట్ కాకపోతే కావాల్సినంత టైం ఇవ్వడం అందరికీ తెలిసిందే.

దేవర సినిమా హిట్ అయినప్పటికీ ఎన్టీఆర్ బిజీ కావడంతో దేవర 2 పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అసలు దేవర 2 ఉంటుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. మేకర్స్ కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు.

దేవర 2 బదులు బాలకృష్ణ హీరోగా...
ఇక ఈ దేవర 2 కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఉండేందుకు కొరటాల ప్లాన్ బికి రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారో తెలీదు... డేట్లు ఎప్పుడు ఇస్తారో తెలీదు... ఇచ్చినా దేవర 2 ఓకే అవుతుందో లేదో తెలీదు... దీంతో కొరటాల ఆ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక బాలయ్యతో ఈ మధ్యే కొరటాల సిట్టింగ్స్ జరిగాయట. బాలయ్యకి కథ కూడా నచ్చిందని సమాచారం. దీంతో కొరటాల ఇక ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడట.

బాలయ్య కోసం కొరటాల బాలీవుడ్ బ్యూటీని దించాలని చూస్తున్నాడట. ఇది వరకు బాలయ్యతో నటించిన విద్యా బాలన్‌ (Vidya Balan)నే మళ్లీ హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలో విద్యా బాలన్ మన బాలయ్యకి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి కొరటాల పుణ్యమా అని ఈ జోడిని ఆడియెన్స్ చూసే అవకాశం ఉంది. బాలయ్య కోసం విద్యా బాలన్‌ను తీసుకోవడం అనేది మంచి ఆప్షన్ అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

Also Read: Bhagyashri Borse: 'సియోన్'లో భాగ్యశ్రీ బోర్సే... బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూశారా?

బాలయ్య సైతం అఖండ 2తో కాస్త డీలా పడి ఉన్నాడు. అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భారీ కాన్ఫిడెన్స్‌తో బాలయ్య ఉండేవారు. ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కానీ చివరకు ఆ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. దీంతో బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద గట్టిగా ఫోకస్ చేశారు. ఆల్రెడీ గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఇప్పుడు ఇలా కొరటాల ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ఈ రెండిటితో భారీ విజయాలు అందుకోవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam