Dailyhunt
Balakrishna : నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...

Balakrishna : నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...

ABP దేశం 1 week ago

Vijay Kanakamedala To Plan Cop Drama With Balakrishna : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని 'NBK111' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్ సాగుతుండగా... బాలయ్య నెక్స్ట్ మూవీపై కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

నాంది డైరెక్టర్తో...

అల్లరి నరేష్ 'నాంది' మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేడల... బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీ చెప్పగా బాలకృష్ణ ఓకే చెప్పినట్లు సమాచారం. కాప్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందట. అన్నీ కుదిరితే గోపీచంద్ మలినేని మూవీ తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

రీసెంట్గా భగవంత్ కేసరి మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. గతంలో వచ్చిన మూవీస్లోనూ ఖాకీ చొక్కా వేసుకుని పవర్ ఫుల్ లుక్లో అదరగొట్టారు. మరోసారి కాప్ యాక్షన్ డ్రామాకు ఓకే చెప్పడంతో హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

NBK 112 ప్రాజెక్ట్ ఎవరితో?

అయితే, 'సరిపోదా శనివారం' వివేక్ ఆత్రేయతోనూ బాలయ్య ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. హై ఆక్టేన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా ప్లాన్ చేస్తుండగా... NBK 111 తర్వాత ఈ మూవీనే స్టార్ట్ అవుతుందనే ప్రచారం సాగింది.ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా... ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. సరికొత్త లుక్లో బాలయ్యను చూపించేందుకు వివేక్ రెడీ అవుతుండగా... ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.

మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది. వివేత్ ఆత్రేయతో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దసరా నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపించగా... త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇక గోపీచంద్ మలినేని మూవీ విషయానికొస్తే... ఇంతకు ముందు పీరియాడికల్ యాక్షన్ డ్రామా NBK111 అనౌన్స్ చేశారు. అయితే, ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టి బాలయ్య స్టార్ డమ్కు తగ్గట్లుగా ఫ్యామిలీ ఎమోషన్స్, అనుబంధాలు నేపథ్యంలో యాక్షన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ను రెడీ చేశారట. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. త్వరలోనే దీని షూటింగ్ అప్డేట్స్ రివీల్ కానున్నాయి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam