Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

ABP దేశం 1 week ago

Balka Suman Arrested: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో తెలంగాణ భవన్‌ కేంద్రంగా హైడ్రామా సాగింది.

తీవ్ర ఉద్రిక్తత మధ్య ఆయన్ని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సింగరేణిని తగలబెట్టాలని, మిలిటెంట్‌ యాక్టివిటీ చేయాలని చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు స్టేషన్స్‌లో కేసులు నమోదు అయ్యాయి.

సింగరేణి బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అరెస్టుకు దారి తీశాయి. సింగరేణిని తగులబెట్టండి... మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. డబ్బులు కావాలంటే ఆఫీస్‌లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కామెంట్స్‌పై ఆనంద్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 326(g), 351(3), 353(1)(b), r/w 61(2)(a), BNS4 PDPPA వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మిలిటెంట్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరిగింది. దీంతో బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌నే తన ఆవాసంగా మార్చుకున్నారు. ఆయన బయటకు రాగానే అరెస్టు చేయాలని పోలీసులు వ్యూహం రచించారు. భవన్ వెలుపల భారీగా పోలీసులు మోహరించారు. లోపల బీఆర్‌ఎస్ కార్యకర్తలు, లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ గో బ్యాక్ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని బీఆర్‌ఎస్‌ లీగర్‌ సెల్‌ ప్రశ్నించగా, నాన్‌బెయిల్‌బుల్ కేసులు కాబట్టి నోటీసులు అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు.

అరెస్టుకు కొద్ది నిమిషాల ముందు బాల్క సుమన్ మీడియా ముందు తన గళాన్ని గట్టిగానే వినిపించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 250కిపైగా కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపి పైశాచికానందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో వందల కోట్ల స్కాములు జరుగుతున్నాయని, వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆయన దుయ్యబట్టారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అత్యంత కఠినమైనవి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రేరేపించడం వంటి సెక్షన్ల వల్ల పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. బీఆర్‌ఎస్‌ లాయర్లు మాత్రం ఇవన్నీ అక్రమ కేసులని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam