శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి విటమిన్ B12 చాలా అవసరం. ఇది నరాల ఆరోగ్యం, రక్తకణాల తయారీ, మెదడు పనితీరుకు అవసరం. ఇది తగ్గితే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మరి విటమిన్ B12 లోపం ఉంటే డైట్‌లో చేర్చాల్సిన ఆహారాలు ఏంటో చూద్దాం.
గుడ్లలో విటమిన్ B12 మంచి మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా ఎగ్ యోక్‌లో ఈ పోషకం ఎక్కువగా లభిస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవడం ఉపయోగకరంగా ఉండొచ్చు.
సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపల్లో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తుల్లో కూడా B12 ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. శరీరంలో B12 స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు B12 కూడా ఉంటుంది. శరీర బలహీనత తగ్గించడంలో, ఎనర్జీ మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది.
జంతువుల కాలేయంలో విటమిన్ B12 చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ మంచిది కాకపోవచ్చు. కాబట్టి పరిమితంగా తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్లో తీసుకునే సెరెల్స్‌లో అదనంగా విటమిన్ B12 ఉంటుంది. వెజిటేరియన్స్‌కు ఇవి కొంతవరకు ఉపయోగపడవచ్చు.
వెజిటేరియన్స్, వీగన్స్ కోసం ఈస్ట్ మంచి ఆప్షన్‌గా భావిస్తారు. కొన్ని రకాల న్యూట్రిషనల్ ఈస్ట్‌లో B12 ఫోర్టిఫై చేసి ఉంటుంది.
కేవలం అలసట ఉందని అనుకుని B12 సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ముందుగా రక్త పరీక్ష చేయించుకుని నిజంగా లోపం ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే లోపం ఉంటే డాక్టర్ సూచించిన సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

