Dailyhunt
Brahmamudi Serial Today April 7th: 'బ్రహ్మముడి' సీరియల్: ఇందుకు బర్తుడే విషెష్‌ చెప్పిన రేఖ - రేఖను తిట్టిన అపర్ణ

Brahmamudi Serial Today April 7th: 'బ్రహ్మముడి' సీరియల్: ఇందుకు బర్తుడే విషెష్‌ చెప్పిన రేఖ - రేఖను తిట్టిన అపర్ణ

ABP దేశం 1 week ago

Brahmamudi Serial Today Episode: అపర్ణ ఇచ్చిన కావ్య బుక్‌ మొత్తం చదివి అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఇందు. అప్పుడే కావ్య ఆత్మ వచ్చి ఇందును నిద్రలేపుతుంది.

నిద్ర లేచిన ఇందు కావ్యను చూసి షాక్‌ అవుతుంది.

కావ్య: ఏంటి అచ్చం నీలాగే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా..? నువ్వు నా రక్తానివే కదా..?

ఇందు: అమ్మా.. అమ్మా…

కావ్య: ఏమైందమ్మా ఇప్పుడెందుకు అలా బాధపడుతున్నావు..?

ఇందు: అమ్మ నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు అమ్మ

కావ్య: నేను ఎక్కడికి వెళ్లాను.. నీ మనసులోనే ఉన్నాను. నీ ప్రతి ఆలోచనలోనూ నేను ఉన్నాను..

ఇందు: నాకు భయంగా ఉందమ్మా..?

కావ్య: ఎందుకు భయపడుతున్నావు ఇందు అంత కష్టం ఇప్పుడు ఏమి వచ్చింది

ఇందు: అమ్మా ఆ రేఖ..

కావ్య: తాతయ్య వాళ్లను చంపేస్తాను అంది. ఆస్థి కోసం సంతకం పెట్టాలని బెదిరిస్తుంది అంతే కదా

ఇందు: అంతే అంటావేంటి అమ్మా.. వాళ్లను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మ

కావ్య: జవాబు లేని ప్రశ్న అంటూ ఈ లోకంలోనే లేదు ఇందు. నువ్వు ప్రయత్నిస్తే ఈ సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది

ఇందు: లేదమ్మా నీ అంత ధైర్యం కానీ నీ అంత తెలివి కానీ నాకు లేవు.. నీలా కష్టం వస్తే నేను యుద్దం చేయలేను

కావ్య: అలా అని ఎవరన్నారు. నువ్వు నా రక్తానివి నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు..

ఇందు: లేదమ్మా నేను ఓడిపోయాను.. వాళ్లను కాపాడుకోవడం కోసం ఆస్థి మొత్తం ఇచ్చేయాలని డిసైడ్‌ అయిపోయను. మీ ఆశయాలను ఆశలను నాశనం చేసేశాను. నేను ఈ యుద్దంలో ఓడిపోయాను అమ్మ. నీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదమ్మా

కావ్య: ఇందు అన్నీ యుద్దాలు గెలవాలని ఎందుకు అనుకుంటున్నావు..పోనీ నేను ఏమైనా అన్ని యుద్దాలు గెలిచాను అనుకుంటున్నావా..? కొన్నిసార్లు మనకు పోరాడే అవకాశం కూడా ఉండదు. కాలం కలిసి రానప్పుడు కలిసొచ్చే వరకు ఎదురుచూడాలి. నువ్వు ఇప్పుడు సంతకం పెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నీకంటూ ఓ రోజు వస్తుంది. నువ్వు చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు ఈ ప్రకృతే నీకు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తుంది.

ఇందు: అమ్మా తప్పకుండా గెలిపిస్తుందా..?

కావ్య: తప్పకుండా గెలిపిస్తుంది. కానీ అది జరగాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు అనుకున్నది సాధించగలను అని నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఇందు కాస్త జాగ్రత్తగా ఆలోచించు.. ఒక వెలుగులా నీకు మార్గం దొరుకుతుంది నీ మీద నమ్మకం పెట్టుకుని ఆలోచించు

అంటూ కావ్య మాయం అవుతుంది. ఇందు ధైర్యంగా ఆలోచిస్తాను అమ్మా అనుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయమే రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ ఇందు రూంలోకి వెళ్లి బర్తుడే విషెష్‌ చెప్తారు. అంతా చూస్తున్న అపర్ణ రేఖను తిడుతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్వాతి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నావు అక్కా అని అడిగితే నన్ను నేను కిడ్నాప్‌ చేసుకుంటాను. కేక్‌ కట్‌ చేయగానే అని ఇందు చెప్తుంది. స్వాతి షాక్‌ అవుతుంది. తర్వాత అందరూ గెస్ట్‌హౌస్‌ కు వెళ్తారు. బర్తుడే పార్టీ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. చక్రి వచ్చి రేఖకు వార్నింగ్‌ ఇచ్చి వెల్లిపోతాడు. మరోవైపు ఇందును కిడ్నాప్‌ చేసేందుకు వెయిటర్లుగా గెటప్‌ వేసుకుని రాజు, లక్కీ అక్కడికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam