Dailyhunt
Brahmamudi Serial Today April 8th: 'బ్రహ్మముడి' సీరియల్: ఇందు బర్తుడే ఫంక్షన్‌కు వచ్చిన నందు - కిడ్నాప్‌ చేసేందుకు స్వాతి ప్లాన్‌

Brahmamudi Serial Today April 8th: 'బ్రహ్మముడి' సీరియల్: ఇందు బర్తుడే ఫంక్షన్‌కు వచ్చిన నందు - కిడ్నాప్‌ చేసేందుకు స్వాతి ప్లాన్‌

ABP దేశం 1 week ago

Brahmamudi Serial Today Episode: ఇందును కిడ్నాప్‌ చేసేందుకు మారువేషంలో వచ్చిన లక్కీ, రాజులకు జాగ్రత్తలు చెప్తుంది ఐశ్వర్య. తర్వాత ఐశ్వర్య లోపలకు వెళ్తుంటే ఆమె వెనకాలే వెళ్తుంటారు రాజు, లక్కీ.

దీంతో ఐశ్వర్య వాళ్లను తిడుతుంది.

ఐశ్వర్య: మీరెక్కడికి వస్తున్నారు… నా వెనకాలే మీరు వస్తే.. అందరికీ అనుమానం వస్తుంది. లోపల ఇంకా ఏమీ స్టార్ట్‌ కాలేదు.. మీరు తర్వాత లోపలికి రండి.. గుర్తు పెట్టుకోండి ఇందు కేక్‌ కట్‌ చేసే సమయంలోనే కిడ్నాప్‌ చేయాలి

అంటూ చెప్పి వెల్లిపోతుంది ఐశ్వర్య. లోపల భ్రమరాంబ హడావిడి చేస్తుంటుంది.

భ్రమరాంబ: ఇంకా ఏదీ రెడీ కాలేదేంటి

ఈవెంట్‌ మేనేజర్‌: బొకే ప్లవర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాం.. అది రాగానే అయిపోతుంది మేడం

అప్పుడే బయట నందు ప్లవర్స్‌ తీసుకుని వస్తుంది. నందును చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు.

లక్కీ: ఇంతకీ ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు.. అన్ని ప్లవర్స్‌ పట్టుకుందేంటి..కొంపదీసి మనం కిడ్నాప్‌ చేసే విషయం తెలిసిందంటావా మావ..

రాజు: ఆ అమ్మాయి చాలా డేంజర్‌ రా ఆరోజు మనల్ని చూసిందేమో ఎందుకైనా మంచిది మనం మాస్కులు వేసుకునే ఉందాం

అనుకుంటూ లోపలికి వెళ్తుంటే అప్పుడే కారులో వచ్చిన ఇందును చూసి రాజు లక్కీ షాక్‌ అవుతారు.

నందు: తను ఏంటి ఇక్కడ ఉంది..?

అప్పుడే అపర్ణ వస్తుంది. అపర్ణను నందు చూసి ఎమోషనల్ అవుతుంది.

స్వాతి: అక్క ఎలా ఉంది నాన్నమ్మ.

నందు: (మనసులో) అంటే తను మా అక్కా

అపర్ణ: రేఖ ఇచ్చిన బట్టలు కాబట్టి నచ్చడం లేదు. అయినా నీకు ఏం చెప్పాను

ఇందు: ఇప్పుడేం మాట్లాడకు నాన్నమ్మ ఇప్పుడు నాకు కావాల్సింది మీ ఆశీర్వాదం ఆశీర్వదించు

అపర్ణ: సంతోషంగా ఉండు అని కూడా మనసారా దీవించలేకపోతున్నాను. నువ్వు అనుకున్నది జరగాలి. అది అందరికి మంచి జరగాలి

స్వాతి: ( మనసులో) పాపం నాన్నమ్మకు నేను వేసిన కిడ్నాప్‌ ప్లాన్‌ తెలియక టెన్షన్‌ పడుతుంది

నందు: ( మనసులో) అంటే ఇన్ని రోజులు నేను తిరుగుతున్నది నా అక్కతోనా..?

లక్కీ: ఏంటి మావా ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు..

రాజు: ఇన్ని రోజులు ఇది మన మీద పడిపోతుంటే దీన్ని రాక్షసి అనుకున్నానురా..?

లక్కీ: మరి ఇప్పుడేం అనుకుంటున్నావు..

రాజు: అందాల రాక్షసి అనుకుంటున్నాను ఇంత అందాల రాక్షసిని కిడ్నాప్‌ చేయడంలో తప్పు లేదురా..?

లక్కీ: ముందు మాస్క్‌ పెట్టుకో మావా దొరికితే కుళ్ల బొడిచేస్తారు..

ఇందు, అపర్ణ, స్వాతి లోపలికి వెళ్తారు. నందు తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ బాబాయ్‌కు నిజం చెప్తుంది. అయితే వెళ్లి వాళ్లకు నిజం చెప్పమని చెప్తాడు కానిస్టేబుల్‌ బాబాయ్‌. నిజం చెప్తే ఆ రేఖ తనను పోలీస్ ను కానివ్వదని సమయం వచ్చినప్పుడు నిజం చెప్తానని అంటుంది నందు. తర్వాత ఇందును కిడ్నాప్‌ చేయడానికి స్వాతి ఇద్దరు వ్యక్తులకు కిరాయి ఇచ్చినట్టు ఇందుకు చెప్తుంది. మరోవైపు భ్రమరాంబ అనవసరంగా అపర్ణను తిట్టడం చూసిన నందు భ్రమరాంబ ఒక్కతే రూంలోకి వెళ్లడం చూసి వెనకాలే వెల్లి ముసుగు వేసి కొట్టి బయటకు వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam