Brahmamudi Serial Today Episode: చలపతి ఇంటికి వెళ్లిన రాజు, రూంలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న వెంకీని ఓదారుస్తాడు. ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని చెప్తాడు.
ఇక దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మీ వత్రం చేయాలని అందరూ డిసైడ్ అవుతారు. అక్కడే ఇందు, రాజులకు పెళ్లి కాలేదని నిరూపించాలి అనుకుంటుంది ఐషు. ఇంకా బ్రహ్మముడి సీరియల్ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందనేది టీవీలో కన్నా ముందు మనం తెలుసుకుందాం.
లక్ష్మీని మెచ్చుకుని వెంకీని ఓదార్చిన రాజు
మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
ఇంటికి వెళ్లి లక్ష్మీ భోజనం పెడితే తింటూ అమ్మ నీ చేతి వంట సూపర్.. నిజంగా ఎంత ఖరీదైన ఫుడ్డు తిన్నా రాని రుచి టేస్ట్ నీ చేతి వంటలో వస్తాయి అమ్మా.. ఈ ఫుడ్డు కోసమైనా రోజు ఇక్కడికి రావాలి అనిపిస్తుంది అంటూ మాట్లాడుతుంటే.. అప్పుడే చలపతి వస్తాడు. అయితే ఫుడ్డు కోసమే ఇక్కడకు వస్తావా..? మాకోసం రావా..? అంటూ అడగ్గానే.. రాజు అదేం లేదు నాన్న అక్కడ ఆఫీసు పనులు ఉన్నాయి.. అందుకే రావడం కుదరడం లేదు.. అని చెప్పగానే.. చలపతి.. వెంకీ గురించి చెప్తూ.. వాడు ఏదో కోచింగ్ తీసుకుంటే జాబ్ కూడా వాళ్లే ఇప్పిస్తారట.. అందుకే వాడికి ఆ కోచింగ్ ఇప్పిద్దామని చెప్తాడు.. ఇప్పిద్దాం వెంటనే తమ్ముడిని జాయిన్ అవ్వమని చెప్పండి అంటే..
అయితే అందుకు యాభై వేల రూపాయలు కట్టాలట అని చలపతి చెప్పగానే.. రాజు కంగారుపడతాడు. యాభై వేలా..? అంటూ తినడం ఆపేస్తాడు.. పోనీ ఎవరిదగ్గరైనా అప్పు తీసుకుందామా..? నెలనెల ఇంత కట్టొచ్చు అని చలపతి చెబితే.. అప్పా అసలే వద్దు… నేనే ఎలాగోలా చూస్తాను అంటాడు రాజు. రాజు మాటలకు చలపతి ఆశ్చర్యపోతాడు. ఎంత మారిపోయావురా..? ఇంతకుముందు ఉచితంగా డబ్బులు కొట్టేద్దాం అని ఆలోచించేవాడివి… ఇప్పుడు అప్పు తీసుకుందాం అంటేనే భయపడిపోతున్నావు అంటూ మెచ్చుకుంటాడు. రాజు భోజనం చేసిన తర్వాత వెంకీ దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. ఎందుకు మూడీగా ఉన్నావు.. ఏమైనా అవసరం ఉంటే ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోకు నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్దంగా ఉంటాను అని చెప్పి వెళ్లిపోతాడు రాజు.
రాజు, ఇందు వ్రతంలో పాల్గొనేలా చేసిన ఐషు
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
దుగ్గిరాల ఇంట్లో అందరూ వరలక్ష్మీ వ్రతం చేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడే ఐశ్వర్య కూడా ఇందును ఇరికించాలని అసలు ఇందు, రాజులకు పెళ్లే కాలేదని నిరూపించాలని ఆలోచిస్తుంది. వెంటనే రేఖతో ఈ వ్రతంలో ఇందు, రాజులను కూడా పాల్గొనమని చెప్పండి ఆంటీ అంటంది. భ్రమరాంబ అవును వాళ్లను కూడా ఈ వ్రతంలో పాల్గొనమని చెప్పాలి అంటూ ఇందును పిలుస్తుంది. వ్రతం గురించి చెప్తుంది. ఇందు కంగారు పడుతుంది అపర్ణ కల్పించుకుని రేపు మీకు ఆఫీసులో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు కదా..? మరి వ్రతంలో పాల్గొంటే మీటింగ్ కు ఎలా వెళ్తారు. వ్రతం ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు మీటింగ్ అలా చేయలేరు కదా అంటూ తప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ రేఖ, భ్రమరాంబ, ఐశ్వర్య పట్టుబట్టి ఇందును వ్రతానికి ఒప్పిస్తారు.
ఇందును తిట్టిన అపర్ణ
కిచెన్‌లోకి వెళ్లిన ఇందు వెనకాలే అపర్ణ వెళ్లి తిడుతుంది. మీ ఇద్దరికి పెళ్లి కాకుండా ఎలా వ్రతంలో పాల్గొంటారు. అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. అసలు నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సింది ఇందు అంటూ చెప్పగానే.. ఒప్పుకోకపోతే వాళ్లకు డౌటు వస్తుంది నాన్నమ్మ. అది మరీ డేంజర్ అంతా అమ్మవారే చూసుకుంటారు.. పెళ్లి అయిన వాళ్లే కాదు.. పెళ్లి కాని వాళ్లు కూడా మంచి లైఫ్ పార్టనర్ దొరకాలని వ్రతంలో పాల్గొంటారు కదా మేము అలాగే అనుకుని మా ఇద్దరికి పెళ్లి జరగాలని కోరుకుంటూ వ్రతంలో పాల్గొంటాం అని చెప్తుంది. మరి ఈ విషయం రాజుకు ఎలా చెప్తావని అపర్ణ అడుగుతుండగానే.. రాజు వస్తాడు. ఏంటి అమ్మమ్మ ఇద్దరూ గుసగుసలాడుతున్నారు.. మీ మనవరాలు నా మీద ఏదైనా కంప్లైంట్ చేస్తుందా..? అని అడిగితే.. నువ్వు నన్ను బాగా చూసుకోవడం లేదని కంప్లైంట్ చేస్తున్నాను అంటుంది ఇందు. అందుకు రాజు కోపంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. అని అడగ్గానే.. అపర్ణ కూడా అవును బాబు ఈ విషయం గురించే మీ నాన్నగారికి ఫోన్ చేద్దాం అనుకున్నాము అంటుంది. అందుకు రాజు కంగారుపడుతూ అసలు అలా చేయోద్దు.. అంటూ ఇందును తీసుకుని రూంలోకి వెళ్లిపోతాడు.
రూంలోకి వెళ్లిన ఇందు తమ ఇంట్లో చేయబోయే వరలక్ష్మీ వ్రతం గురించి చెప్తుంది. ఆ వ్రతంలో తామిద్దరూ భార్యభర్తల్లా కూర్చోవాలని లేదంటే అందరికీ డౌటు వస్తుందని చెప్తుంది. ఇందు మాటలకు రాజు షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త
Author : Sudhakar Mansetty

