Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today August 4th: 'బ్రహ్మముడి' సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ - గుడిలో ఎంక్వైరీ చేసిన భ్రమరాంబ

Brahmamudi Serial Today August 4th: 'బ్రహ్మముడి' సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ - గుడిలో ఎంక్వైరీ చేసిన భ్రమరాంబ

ABP దేశం 1 week ago

Brahmamudi Serial Today Episode: గుడిలోకి వెళ్లి పంతులుతో ఎంక్వైరీ చేస్తారు భ్రమరాంబ, శేషు. మరోవైపు శశికి బర్తుడే గిప్ట్‌ ఇవ్వడం కోసం రేఖను రెండు లక్షలు అడుగుతుంది ఐశ్వర్య.

ఇక గుడిలో వ్రతం జరగలేదని రాజు ఇంటికి రాగానే.. అపర్ణ, సుభాష్‌ రాజు మీద అలిగినట్టు నటిస్తారు. ఇంకా ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్‌ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడికి వెళ్లి ఎంక్వైరీ చేసిన భ్రమరాంబ, శేషు

మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

భ్రమరాంబ, శేషు అనుమానంతో గుడికి వెళ్తున్నారని అర్థం చేసుకున్న రాజు పంచె కట్టుకుని గుడికి వెళ్తాడు. గుడిలోకి వస్తున్న రాజును చూసి అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. వెంటనే వెళ్లి పలకరించబోతే ఇందు అడ్డుపడి ఆపేస్తుంది. నాన్నమ్మ ఇప్పుడు మీరు వెళ్లొద్దు.. వెంటనే వెనక నుంచి ఇంటికి వెళ్లిపోండి తర్వాత నేను చెప్తాను అంటూ చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ వెళ్లిపోతారు. రాజు దగ్గరకు రాగానే ఇందు రాజును తిడుతుంది. రాజు మాత్రం భ్రమరాంబ, శేషులకు అనుమానం వచ్చిందని అందుకే గుడికి వస్తున్నారని వాళ్లకు అనుమానం రాకుండా చేయాలి అంటాడు. అందుకోసం చిన్న నాటకం ఆడి పంతులు ద్వారా సెట్‌ చేస్తాడు. అప్పుడే వ్రతం చేయించుకున్న జంట దగ్గరకు వెళ్లి రాజు, ఇందు మాట్లాడుతుంటారు. అప్పుడే గుడిలోకి వెళ్ళిన భ్రమరాంబ, శేషు ఇద్దరూ కలిసి పంతులు దగ్గరకు వెళ్లి ఇందాక వ్రతం చేయించుకున్న జంట ఎవరు అని అడుగుతారు. పంతులు వాళ్లను చూపిస్తాడు. వాళ్ల పక్కనే మాట్లాడుతూ ఇందు, రాజు ఉంటారు. వాళ్లే వ్రతం చేయించుకున్నారని తమ అనుమానం నిజం కాదని భ్రమరాంబ, శేషు వెళ్లిపోతారు. రాజు చూశావా..? నా టాలెంట్‌ అంటాడు. ఇందు, రాజును తిట్టి ఇంటికి వెళ్లిపోతుంది.

ఐశ్వర్యకు ఫోన్‌ చేసిన శశి

ఐశ్వర్యకు ఫోన్‌ చేసిన శశి ఎలాగైనా ఐషును ట్రాప్‌ చేయాలని తన దారిలోకి తెచ్చుకోవాలని తన బర్తుడే నాటకం ఆడతాడు. ఎల్లుండి తన బర్తుడే అని ఐషును తప్పకుండా రావాలని పెద్ద పార్టీ ఇస్తానని చెప్తాడు. ఐషు కూడా వస్తానని చెప్తుంది. తర్వాత శశి తనకు ప్రపోజ్‌ చేస్తాడని.. తనను ఎలాగైనా పెళ్లి దాకా తీసుకెళ్లాలని అందుకోసం కాస్లీ గిఫ్ట్‌ ఇవ్వాలని రేఖ ఆంటీని రెండు లక్షలు అడగాలని డిసైడ్‌ అవుతుంది.

ఐషుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ

ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

రేఖ గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ.. రాజు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. రాజు ఇంకెవరికో లక్కీ తల్లిని నేనే అన్న సీక్రెట్‌ చెప్పాను అన్నాడు. ఇంతకీ ఎవరికి చెప్పి ఉంటాడు అని ఆలోచిస్తుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి తనకు నిజం మొత్తం తెలిసిందని చెప్తుంది. రేఖ కంగారుగా ఏం నిజం తెలిసింది అని అడగ్గానే.. అదే ఆ ఇందు, రాజుల పెళ్లి గురించి ఐశ్వర్య చెప్పింది అంతా అబద్దం వాళ్లిద్దరికీ నిజంగానే పెళ్లి అయింది రేఖ. మాకు ఇప్పుడే ఆ నిజం తెలిసింది అని చెప్తుంది. అప్పుడే ఐషు బయటకు వచ్చి రేఖను తనకు రెండు లక్షలు కావాలని అడుగుతుంది. అందుకు రేఖ కోపంగా ఐషును తిడుతూ.. రెండు లక్షలు కాదు కదా..? ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఇంట్లోకి వెళ్లు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఐషు వెళ్లిపోతుంది.

అలిగిన అపర్ణ, సుభాష్‌ - ఓదార్చిన రాజు

అపర్ణ రాజు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. అప్పుడే ఇందు బయటి నుంచి వచ్చి రాజు ఇంటికే వస్తున్నాడని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో రాజు వస్తాడు. రాజును చూసి అపర్ణ, సుభాష్‌ అలిగినట్టు నటిస్తారు. తాము ఏం చెప్పినా నువ్వు చేయవు కదా అంటూ బెట్టు చేస్తుంటారు. రాజు వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అయినా అపర్ణ, సుభాష్‌ రాజుతో మాట్లాడమని వెళ్లిపోతారు. రాజు కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు వెళితే ఇందు కూడా తిట్టి వెళ్లిపోతుంది. అయోమయంలో పడిపోతాడు రాజు.. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam