Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today July 31st: 'బ్రహ్మముడి' సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ - అయోమయంలో ఇందు

Brahmamudi Serial Today July 31st: 'బ్రహ్మముడి' సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ - అయోమయంలో ఇందు

ABP దేశం 2 weeks ago

Brahmamudi Serial Today Episode: రాజును చూసి ఏమోషనల్‌ అవుతున్న అపర్ణకు మనసులోనే సారీ చెప్తుంది ఇందు. రాజు సొంత మనవడన్న నిజం చెప్పనందుకు క్షమించమని మనసులో అడుగుతుంది.

ఇక ఫుల్లుగా మందు తాగి ఇంటికి వచ్చిన ఐషు ఇంట్లో రచ్చరచ్చ చేయడంతో బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

అపర్ణకు మనసులోనే సారీ చెప్పుకున్న ఇందు

ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

రాజు భోజనం చేస్తుంటే.. అపర్ణ తను భోజనం చేయకుండా తదేకంగా రాజును చూస్తుంది. రాజు వెంటనే అమ్మమ్మ తినండి ఎందుకు నన్ను చూస్తున్నారు అని చెప్తాడు. అందుకు అపర్ణ తింటానులే బాబు.. అంటుంది. పక్కనే ఉండి అంతా వింటున్న ఇందు అపర్ణకు మనసులోనే సారీ చెప్పి.. నీ మనవడు అన్న నిజం చెప్పనందుకు క్షమించు నాన్నమ్మ అని మనసులోనే అనుకుంటుంది. ఇంతలో స్వాతి వచ్చి అక్కా నువ్వు వద్దనా..? ఐశ్వర్య పార్టీకి వెళ్లింది అని చెప్తుంది. కారు కీస్‌ లేవు కదా ఎలా వెళ్లింది అని అపర్ణ అడిగితే లక్కీ బైక్‌ మీద వెళ్లింది అని స్వాతి చెప్తుంది. రాజు షాక్‌ అవుతాడు అరేయ్‌ లక్కీగా అనుకుంటుండగానే ఇందు కోపంగా లక్కీని తిట్టి రాజును నిలదీస్తుంది. ఎందుకు తీసుకెళ్లాడు లక్కీ అంటూ ప్రశ్నిస్తుంది. అందుకు రాజు వాడు లిఫ్ట్‌ ఇచ్చాడేమో అని చెప్పి వెళ్లిపోతాడు.

లక్కీని అవమానించిన శశి

ఐశ్వర్యను తీసుకుని పార్టీ దగ్గరకు వెళ్తాడు లక్కీ. లక్కీని చూసి బైక్‌ బుక్‌ చేసుకుని వచ్చావా..? నాకు చెబితే కారు తీసుకుని వచ్చేవాడిని కదా..? అంటూ శశి చెప్పగానే.. దగ్గరకు వెళ్లిన ఐషు, శశిని హగ్‌ చేసుకుంటుంది. అది చూసి లక్కీ షాక్‌ అవుతాడు. ఇందుకోసమేనా నేను ఐషును తీసుకొచ్చింది అని బాధపడుతుంటాడు. బైక్‌ వాడికి డబ్బులు ఇవ్వలేదా ఇంకా వెళ్లడం లేదు అని శశి అడిగితే అంతే కాదు వాడు మా ఇంట్లోనే ఉంటాడు.. మనం బీర్‌ తాగాక అయిపోతే మళ్లీ బీర్లు తీసుకురావడానికి పనికొస్తాడని తీసుకొచ్చానని చెప్తుంది ఐషు. ఆ మాటకు లక్కీ మరింత బాధతో ఎమోషనల్ అవుతాడు. శశి, ఐషు లోపలికి వెళ్తూ.. లక్కీని తీసుకుని వెళ్తారు.

పుల్లుగా తాగి ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేసిన ఐషు

అర్దరాత్రి అందరూ నిద్రపోయాక ఐషు పుల్లుగా తాగి ఇంటికి వస్తుంది. ఐషును లక్కీ పట్టుకుని వస్తాడు. ఇంట్లోకి వచ్చాక ఐషు గట్టిగా ఇందును పిలుస్తుంది. ఆ పిలుపునకు అందరూ నిద్ర లేచి వస్తారు. ఇందును ఐషు తిడుతుంది. రాజు అడ్డుపడితే రాజును తిడుతుంది. చివరికి రేఖను కూడా తిట్టి నువ్వు చాలా మారిపోయావు.. ఎందుకు రాజును చూసి భయపడుతున్నావో తెలియదు కానీ చివరికి నీ బతుకు కూడా ఇప్పుడు నా బతుకు అయినట్టే అవుతుంది చూసుకో అంటూ వెళ్లిపోతుంది.

రేఖను నిలదీసిన భ్రమరాంబ, శేషు, భూషణ్‌

మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

భ్రమరాంబ, శేషు ఇద్దరూ కలిసి రేఖ రూంలోకి వెళ్తారు. రేఖను ఎందుకు ఇంతలా మారిపోయావు నీ గురించి ఒక నిజం మాకు తెలిసింది అని భ్రమరాంబ చెప్తుంది. ఆ మాటలకు రేఖ షాక్‌ అవుతుంది. లక్కీ నా కొడుకు అన్న విషయం వీళ్లకు తెలిసిందా ఏంటి..? అని మనసులో అనుకుంటూ భయపడుతూ.. ఏం లేదు మీరు అనుకున్నది నిజం కాదు అంటుంది. అందుకు భ్రమరాంబ మేము ఏమీ అనుకోకుండానే నిజం కాదని ఎలా చెప్తావని ప్రశ్నిస్తుంది. అందుకు రేఖ ఏదైతే మీరు అనుమానిస్తున్నారో అది నిజం కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం అంటూ రేఖ తప్పించుకుంటుంది. తర్వాత అందరూ కలిసి ఐషు చెప్పిన విషయాల గురించి చర్చించుకుంటారు. రేఖ మాత్రం ఇక ఆ విషయాలు మర్చిపోండని చెప్తుంది. భ్రమరాంబ మాత్రం తను వదిలిపెట్టనని నిజానిజాలేంటో తెలుసుకుని తీరాలని మనసులో అనుకుంటుంది.

ఐషు గురించి ఆలోచించిన రాజు, ఇందు

రాజు, ఇందు రూంలో ఉంటారు. ఐశ్వర్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఇందు, రాజును హెచ్చరిస్తుంది. మరోసారి ఆ లక్కీతో కలిసి మందు తాగుతూ నిజాలు చెప్పొద్దని ఐశ్వర్య చాలా అలెర్ట్‌గా ఉంటుందని ఏదైనా చిన్న మిస్టేక్‌ చేసినా నిజం అందరికీ తెలిసిపోతుందని హెచ్చరిస్తుంది. రాజు సరే అంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam