Brahmamudi Serial Today Episode: రాజు ఇంట్లోంచి వెళ్లిపోయాక అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఫోన్ చేసి తిరిగి రమ్మని పిలుస్తుంది. అపర్ణ మాటలకు రాజు ఏం చెప్పాడు అనేది ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌లో తెలుసుకుందాం.
ఇందును తిట్టిన అపర్ణ
అపర్ణ కోపంగా ఇందు దగ్గరకు వెళ్లి తనకు చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడుగుతుంది. అసలు రాజు ఎందుకు తనకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు అంటూ నిలదీస్తుంది. దీంతో రాజు తనంతట తానే వెళ్లిపోయాడని ఇందు చెప్తుంటే.. అపర్ణ, రాజుకు ఫోన్ చేస్తుంది. రేఖ కోపంగా అపర్ణను తిడుతుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నావు… తనంతట తానే వెళ్లిన వాడి కోసం మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటూ కోప్పడుతుంది. అపర్ణ ఫోన్ చేసినా రాజు ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. దీంతో ఫోన్ కూడా కలవడం లేదేంటి..? అంటుంది. ఇందు కోపంగా అపర్ణ చేతిలో ఫోన్ లాక్కుని కింద పడేసి వెళ్లిపోతుంది. వెనకే అపర్ణ వెళ్లిపోతుంది.
తన మాటే నిజమైందన్న రేఖ
ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త
వాళ్లిద్దరూ వెళ్లిపోయాక రేఖ నవ్వుతూ భ్రమరాంబను చూస్తూ.. ఏంటి వదిన ఇప్పుడేమంటావు.. నేను చెప్పాను కదా ఆ రాజు గాడిని ఇందే వెళ్లగొడుతుంది అని చెప్పాను కదా..? అనగానే.. భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటూ వాడు వెళ్లిపోయాడు అంటేనే నాకు ప్రాణం హాయిగా ఉంది రేఖ అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. శేషు మాత్రం వాడు మళ్లీ తిరిగి వస్తే ఏంటి పరిస్థితి అంటూ డౌటు క్రియేట్ చేస్తాడు. ఐశ్వర్య కోపంగా వాడు వెళ్లిపోవడమే కాదు ఆంటీ.. ఒకప్పటిలా మళ్లీ నువ్వు చక్రం తిప్పాలి.. వాళ్లందరు మనకు బానిసల్లా ఉండాలి అందుకోసం నువ్వేమైనా చేయాలి అంటీ అనగానే.. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఐషు. ఇప్పుడే కదా కథ మొదలైంది ఇక నడిపిస్తాను చూడు అంటూ నవ్వుతుంది రేఖ.
రాజును ఓదార్చిన వెంకీ
రూంలో కూర్చుని ఇందును గుర్తు చేసుకుని బాధపడుతున్న రాజు దగ్గరకు వెంకీ వెళ్లి ఓదారుస్తాడు. నువ్వు వదినను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నావని అమ్మానాన్న బాధపడుతున్నారని చెప్తాడు. వదిన అందరికీ నచ్చింది. కానీ అమ్మానాన్న ఎందుకో భయపడుతున్నారని వెంకీ చెబితే.. ఏం లేదురా ఎప్పుడో ఎవరో ఆస్థిపరులను వాళ్ల శత్రువులు చంపేశారని.. ఇప్పుడు నాకు కూడా శత్రువులు పుట్టుకొచ్చి నన్ను ఏం చేస్తారోనని భయపడుతున్నారు అంతే అంటూ రాజు చెప్పగానే.. అయితే నువ్వు ఏం చేయాలనుకున్నా చేయ్ అన్నయ్య కానీ అమ్మా నాన్నకు చెప్పి చేయ్.. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసినా చేయకపోయినా పట్టించుకోలేదు కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకో చాలా భయపడుతూ బాధపడుతున్నారు వాళ్లు అంటూ చెప్పి వెళ్లిపోతాడు వెంకీ.
రాజుతో ఎమోషనల్ అయిన అపర్ణ
ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
రాజుకు ఫోన్ చేసిన అపర్ణ ఏడుస్తూ.. ఎమోషనల్ అవుతుంది. తనను సొంత అమ్మమ్మను అనుకుంటే ఇలా వదిలేసి వెళ్లేవాడివి కాదంటూ బాధపడుతుంది. రాజును సొంత మనవడిగా ఫీల్ అయ్యానని.. అందుకే తన కష్టసుఖాలు మొత్తం చెప్పానని బాధపడుతుంది. ఇందు చిన్న పిల్ల అది చెప్తే నువ్వు వెళ్లిపోతావా..? నువ్వు వచ్చాకే ఇందు జీవితం బాగుపడింది. పని మనిషిగా ఓ మూలన పడి ఉండాల్సింది ఇప్పుడు కంపెనీకి సీఈవో అయింది. ఇందు జీవితంలో వెలుగులు నింపాల్సింది నువ్వే.. ఇప్పుడు నువ్వు వెళ్లిపోయి తన జీవితాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టేస్తావా..? అంటూ ప్రశ్నిస్తుంది. తిరిగి వచ్చి ఇందు జీవితంలో వెలుగులు నింపమని రిక్వెస్ట్ చేస్తుంది. రాజు మౌనంగా వింటూ ఉంటాడు.
ఒంటరి పోరాటం చేస్తానన్న ఇందు, ఆస్థి కోసం రేఖ కొత్త ప్లాన్
ఇందు దగ్గరకు వెళ్లిన అపర్ణ వెంటనే రాజు ఇంటికి రమ్మని ఫోన్ చేయమని చెప్తుంది. అందుకు ఇందు ఒప్పుకోదు. ఇకపై తాను ఒంటరిగానే పోరాటం చేస్తానని చెప్తుంది. సుభాష్ చెప్పినా ఇందు ఒప్పుకోదు. దీంతో అపర్ణ భయపడుతుంది. మళ్లీ రేఖ ఇందును ఏమైనా చేస్తుందోనని ఆందోళన పడుతుంది. మరోవైపు ఆస్థిని మొత్తం తన పేరుపై ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలని రేఖ ఆలోచిస్తుంది. అయితే అదంతా రాజు తిరిగి వచ్చేలోపే జరిగిపోవాలని భ్రమరాంబ సూచిస్తుంది. అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. వాళ్లందరూ మాట్లాడుకోవడం స్వాతి విని భయంతో వెంటనే ఇందు దగ్గరకు వెళ్లి చెప్తుంది. ఇందు తన సంతకం మాత్రమే కాదు తన భర్త సంతకం ఉంటేనే ఆస్థి ట్రాన్స్‌ఫర్ అవుతుందని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Author : Sudhakar Mansetty

