Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today September 1st: 'బ్రహ్మముడి' సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్‌ - రాజును గల్లా పట్టుకుని ప్రశ్నించిన రేఖ

Brahmamudi Serial Today September 1st: 'బ్రహ్మముడి' సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్‌ - రాజును గల్లా పట్టుకుని ప్రశ్నించిన రేఖ

ABP దేశం 2 weeks ago

Brahmamudi Serial Today Episode: రేఖ నిజం చెప్పడంతో మదన్‌ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. తర్వాత రేఖ ఏదైనా చేస్తుందేమోనని సుభాష్‌ భయపడతాడు. రేఖ ఏం చేయలేదని ఇప్పుడు మనకు రాజు ఉన్నాడని అపర్ణ, ఇందు ధైర్యాన్ని ఇస్తారు.

ఇంకా బ్రహ్మముడి సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందనేది టీవీలో కన్నా ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్‌

మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

లక్కీ తన కొడుకే అని రేఖ ఒప్పుకున్న మరుసటి రోజు మదన్‌ ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు రెడీ అవుతాడు. బ్యాగ్‌ సర్దుకుని వెళ్లబోతూ.. రేఖను తిడతాడు. లక్కీ గాడి తల్లిని వెతికే బాధ్యత నువ్వెందుకు తీసుకున్నావని ఆరోజు ప్రశ్నించాను కానీ నువ్వే తల్లివి అని తెలుసుకోలేకపోయాను. ఇక వాడుండగా నీకు నేనెందుకు మమ్మీ నా బతుకేదో నేను చూసుకుంటాను అంటూ వెళ్లబోతుంటే.. రేఖ అడుపడుతుంది. భ్రతిమాలుతుంది. అయినా మదన్‌ ఆగడు.. నేనేదో తప్పు చేసిన వ్యక్తిలా ఈ లోకం నన్ను వెలేస్తుంది. అందుకే నేను వెళ్తున్నాను. అని చెబితే.. శేషు వెళ్తున్నాను వెళ్తున్నాను అంటున్నావు ఎక్కడికి వెళ్తావు అల్లుడు అని అడిగితే.. ఎక్కడికో అక్కడికి వెళ్తున్నాను కానీ ఇక్కడ మాత్రం ఉండను… రాజుకు థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంటాడు. స్వాతి అడ్డు పడుతుంది. బావ ఫ్లీజ్‌ బావ వెళ్లొద్దు బావ అంటూ రిక్వెస్ట్‌ చేసినా మదన్‌ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మదన్‌ వెనకాలే రేఖ పరుగెడుతుంది. భ్రమరాంబ తన తమ్ముడు ఎక్కడున్నాడో అనుకుంటూ పైకి వెళ్తుంది.

మదన్‌ వెళ్లిపోతున్నాడని భూషణ్‌కు చెప్పిన భ్రమరాంబ

పైన రూంలో ఉన్న భూషణ్‌ దగ్గరకు వెళ్లిన భ్రమరాంబ బాధగా మదన్‌ వెళ్లిపోతున్నాడు అని చెబితే వెళ్లని ఈ ప్రపంచానికి ముఖం చూపించలేక వాడు వెళ్తున్నాడు.. నేను వాడికి ముఖం చూపించలేక ఇక్కడే రూంలో ఉండిపోయాను అంటాడు భూషణ్‌. ఇక నేనేం చేయలేను అని చెప్పగానే.. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు మన బతులేంట్రా ఇలా అయిపోయాయి అంటూ ఒరేయ్‌ అల్లుడూ అంటూ కిందకు పరుగెడుతుంది. మదన్‌ వెనకాలే వెళ్లిన రేఖ పట్టుకుని మదన్‌ను రిక్వెస్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లొద్దని ఏడుస్తూ బాధపడుతుంది. మదన్‌ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

రాజు గల్లా పట్టుకుని నిలదీసిన రేఖ

రేఖ కోపంగా ఇంట్లోకి వెళ్లి రాజు గల్లా పట్టుకుని నిలదీస్తుంది. నీ వల్లే వాడు వెళ్లిపోతున్నాడు. పాతికేళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు నా కొడుకు నా దగ్గరకు ఎలా వస్తాడు అంటూ ఏడుస్తుంది. అందుకు రాజు ఏంటి పిన్ని బాధగా ఉందా..? మనం ఒకరిని మోసం చేసినా బాధపెట్టినా వాళ్ల బాధ కూడా ఇలాగే ఉంటుంది పిన్ని. నువ్వు ఇప్పుడు ఎంత బాధనైతే అనుభవిస్తున్నావో పాతికేళ్లుగా నా ఫ్రెండ్‌ అదే లక్కీ కూడా అదే బాధను అనుభవించాడు. నువ్వు వాణ్ని వదిలేసి వెళ్లిన తర్వాత పసిబిడ్డగా వాడు ఎంత గుక్కపెట్టి ఏడిసి ఉంటాడో ఆలోచించుకో అంటూ రాజు చెప్తుంటే.. అందరూ ఎమోషనల్‌ అవుతుంటారు.

రేఖ ఏం చేస్తుందోనని భయపడిన సుభాష్‌

ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

తర్వాత సుభాష్‌ భయంతో రేఖ ఇక తన విశ్వరూపం చూపిస్తుందని పగతో రగిలిపోతుందని మనల్ని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అంటాడు. అపర్ణ మాత్రం ధైర్యంగా రాజు ఉన్నాడని మన మనవడు ఉండగా ఆ రేఖ మనల్ని ఏమీ చేయలేదని ఇప్పుడు తన పతనం మొదలైందని మీరు ధైర్యంగా ఉండండని చెప్తుంది. ఇందు వచ్చి కూడా ఆ రేఖ ఆంటీ పతనం మొదలైంది ఇప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రేపు జరగబోయే దాని గురించి అని చెప్పగానే.. రేపు జరగబోయేది ఏంటని ఏ పండుగ కూడా లేదు కదా అని అపర్ణ అడిగితే.. రేపు రాజు పుట్టిన రోజు అని ఇందు చెబితే.. అపర్ణ అవును చాలా బాగా సెలబ్రేట్‌ చేసుకుందామని చెప్తుంది. సుభాష్‌ మాత్రం చలపతి వాళ్లు రాజు బర్తుడేను వేరే రోజు చేసి ఉండొచ్చు కదా..? అలా అయితే రాజుకు నిజం తెలుస్తుంది కదా అనగానే.. ఇందు అవును ఇది కరెక్టే.. కానీ నేను ప్లాన్‌ చేస్తాను కదా..? ఇప్పుడే చలపతి అంకుల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్తాను అంటుంది.

చలపతికి ఫోన్‌ చేసి నిజం చెప్పిన ఇందు

చలపతి భోజనం చేయబోతూ వెంకీ గురించి అడుగుతాడు. ఏదో పనుందని బయటకు వెళ్లాడని లక్ష్మీ చెప్పగానే.. వాడు జాబ్‌ రావడం లేదని బెంగ పెట్టుకున్నాడేమో కానీ నాకా బెంగ లేదు వాడికి ఎప్పటికైనా పెద్ద జాబ్‌ వస్తుందని నాకు నమ్మకం ఉంది. అలాగని వాడి ముందు నువ్వు బాధపడకు అంటూ లక్ష్మీకి చెప్తుంటే.. ఇందు ఫోన్‌ చేసి రాజు బర్తుడే గురించి చెప్తుంటే వాళ్లకు నిజం తెలిసిపోయిందా అని చలపతి అడిగితే.. తెలిసిందని ఇందు చెప్పగానే.. చలపతి, లక్ష్మీ భయపడతారు. రాజు దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే ఆ రేఖ ఏం చేయలేదా..? బర్తుడేలు ఏమీ వద్దులేమ్మా అంటాడు. నీకు అంతలా చేయాలనుకుంటే నువ్వు రాజు ఇక్కడికే రండి అంటూ పిలుస్తాడు. ఇందు మాత్రం నాన్నమ్మ, తాతయ్య కోసం ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం మీరు ఆంటీ ఇక్కడకే రండి అని చెప్తుంది ఇందు. ఇందు మాటలకు షాక్ అవుతారు చలపతి, లక్ష్మీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam