Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంటికి వచ్చిన చలపతి వాళ్లను భ్రమరాంబ అవమానిస్తుంది. అంతా గమనించిన అపర్ణ కోపంగా భ్రమరాంబను తిడుతుంది.
తర్వాత రాజును నిద్రలేపిని ఇందు బర్తుడే పార్టీకి రెడీ అవ్వమని చెప్తుంది. ఇంటికి వచ్చిన నందుకు వెంకీ ఎదురుపడితే ఎమోషనల్ అవుతుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ ఇవాళ్టీ ఏపిసోడ్‌లో ఏం జరిగిందనేది టీవీలో కన్నా ముందు మనం తెలుసుకుందాం.
చలపతి వాళ్లను అవమానించిన భ్రమరాంబ
మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
చలపతి, లక్ష్మీ, వెంకీ కలిసి దుగ్గిరాల ఇంటికి రాజు బర్తుడే కోసం వెళ్తారు. వాళ్లను చూసిన భ్రమరాంబ వెటకారంగా మాట్లాడుతూ అవమానిస్తుంది. అప్పనంగా ఆస్థికి కొడుకును వారసుడిగా పంపారు అంటూ దెప్పిపొడుస్తుంది. అంతా వింటున్న అపర్ణ కోపంగా భ్రమరాంబను తిడుతుంది. అప్పనంగా తినడం విషయం గురించి నువ్వే చెప్పాలి అంటూ మాట్లాడుతుంది. అందుకు భ్రమరాంబ కోపంగా అపర్ణను తిడుతుంటే.. శేషు అడ్డుపడతాడు. అప్పుడే ఇందు వస్తుంది. చలపతి వాళ్లను పలకరించి ఏం జరిగింది అందరూ అలా ఉన్నారు అని అడిగితే.. జరిగిందంతా శేషు చెప్తాడు. వెంటనే చలపతి ఇంతకీ మా గాడిద ఎక్కడమ్మా అని అడిగితే.. ఆ గాడిద ఇంకా పడుకునే ఉన్నాడు అని చెప్తుంటే.. అపర్ణ అలా మాట్లాడకు అంటుంది. చలపతి మాత్రం తప్పమ్మా.. ఇంత వరకు పడుకుని ఉన్నాడంటే అడ్డగాడిద అనాలి అంటూ నవ్వుతాడు ఇందు నవ్వుతూ మీరు పాయసం తింటూ ఉండండి నేను మీ అడ్డగాడిదను లేపి తీసుకొస్తాను అంటూ పైకి రూంలోకి వెళ్తుంది.
రాజును అడ్డగాడిద అంటూ నిద్రలేపిని ఇందు
రూంలో నిద్ర పోతున్న రాజు దగ్గరకు వెళ్లి చెవిలో ఇంకా పడుకునే ఉంటారా..? ఎప్పుడో తెల్లారిపోయింది అడ్డగాడిద గారు అనగానే.. రాజు కోపంగా నిద్ర లేచి ఎవరో అడ్డగాడిద అంటూ అడగ్గానే.. నేను అనలేదు.. మీ నాన్న గారే అలా అన్నారు.. నేను ఎప్పుడైనా అలా పిలిచానా అడ్డగాడిద గారు అంటూ చెప్పగానే.. ఏయ్ నువ్వు మళ్లీ మళ్లీ అంటావేంటి అంటూ ఇందు చేతి మెలిక తిప్పి పట్టుకుంటాడు రాజు. తనకు సారీ చెప్తేనే వదిలేస్తాను అంటాడు. ఇందు సారీ చెప్తుంది రాజ వదిలేస్తాడు. నీ ఓవరాక్షన్ చాలు కానీ కింద మీ నాన్న గారు వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ అయి రండి లేకపోతే మీ నాన్నే ఇక్కడకు వస్తాడు అని చెప్పగానే.. రాజు రెడీ అవ్వడానికి వెళ్తాడు.
భ్రమరాంబకు వార్నింగ్ ఇచ్చిన నందు
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
నందు అప్పుడే ఇంటికి వస్తుంటే.. భ్రమరాంబ ఎదురుగా వెళ్లి ఏంటి నందు ఏదో పోలీస్ ట్రైనింగ్ అని వెళ్లావు అప్పుడే తిరిగి వచ్చావు.. అక్కడ ఏదైనా తింగరి పని చేశావా..? వాళ్లు నిన్ను ట్రైనింగ్ లోంచి తరిమేశారా..? అని అడిగితే.. వాళ్లు నన్ను తరిమేశారో.. లేక నేనే వచ్చానో నీకు చెప్పినా నమ్మవు కానీ త్వరలోనే నేను పోలీస్ అయి నీకు కనిపిస్తాను అప్పుడు నీకు క్లారిటీ వస్తుందిలే పిన్ని అంటూ చెప్పగానే.. అసలు నువ్వు పోలీస్ జాబ్‌కే అన్ ఫిట్ అని తప్పకుండా నిన్ను తన్ని తరిమేస్తారు అంటూ భ్రమరాంబ చెబితే.. శేషు కోపంగా భ్రమరం అవసరమా నీకు ఇవన్నీ.. ఇప్పుడు పోలీస్ అయిందంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అంటూ చెప్పగానే.. నందు పోలీస్ అయి వచ్చి తనను కొడుతున్నట్టు భ్రమరాంబ ఊహించుకుంటుంది. ఊహలోంచి బయటకు వచ్చి భయంతో వణికిపోతుంది భ్రమరాంబ. ఇక నందు ఇంట్లోకి వెళ్లిపోతుంది.
ఎదరుపడిన నందు, వెంకీ
ఇంట్లోకి వెళ్లిన నందుకు హాల్లో వెంకీ ఎదురుపడతాడు. దీంతో ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ పక్కకు తప్పుకుంటారు. వెంకీ కలగజేసుకుని అన్నయ్య బర్తుడే కదా అందుకే వచ్చాను అంటాడు. నువ్వెందుకు వచ్చావని నేను అడగలేదు అంటుంది నందు. పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉందని వెంకీ అడిగితే.. ఇష్టపడిన జాబ్ కదా బాగానే ఉంది. కానీ ఇష్టమైన వాళ్లకు దూరంగా ఉండటమే నచ్చడం లేదు అంటూ వెంకీతో బాధపడుతుంది. తన ఎమోషనల్ ను దాచుకుంటూ వెంకీతో ఏదేదో మాట్లాడుతుంది. వెంకీ వెనకే నిలబడి అంతా వింటుంది ఇందు. ఇందును చూసిన నందు ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకుంటుంది. ఏడుస్తుంది. ఇందు, నందును ఓదారుస్తుంది ఏంటా కన్నీళ్లు అని అడిగితే.. ఇవి కన్నీళ్లు కాదు అక్క ఆనంద బాష్పాలు ఇష్టమైన వారిని చూశాను కదా అందుకే వస్తున్నాయి అంటూ చెప్తుంది నందు.
తనను క్షమించమని అపర్ణను అడిగిన చలపతి
అపర్ణను క్షమించమని ఆరోజు మీరు మా ఇంటికి వచ్చి రాజు గురించి అడిగితే అబద్దం చెప్పామని చలపతి అడిగితే.. నేను క్షమించడం కాదు మేమేం చేసినా మీ రుణం తీర్చుకోలేము మా దుగ్గిరాల వారసుడు బతికే ఉన్నాడంటే దానికి కారణం మీరే అంటూ అపర్ణ మాట్లాడుతుంది. అప్పుడే రాజు రెడీ అయి కిందకు వస్తాడు. రాజును చూసిన చలపతి, లక్ష్మీ గర్వంగా ఫీలవుతారు. రాజు ఆశీర్వాదం అడిగితే.. పెద్దవాళ్లు మీ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త
Author : Sudhakar Mansetty

