Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brazil Nuts for Thyroid Health : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?

Brazil Nuts for Thyroid Health : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?

ABP దేశం 1 week ago

Brazil Nuts Benefits for Thyroid Patients : థైరాయిడ్ గ్రంథి శరీరంలోని మెటబాలిజం, శక్తి వినియోగం, హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

థైరాయిడ్ పనితీరు సరిగా లేకపోతే అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో బ్రెజిల్ నట్స్ ఒకటి. థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సమృద్ధిగా ఉండే సెలీనియం

బ్రెజిల్ నట్స్ ప్రపంచంలోనే అత్యధిక సెలీనియం కలిగిన ఆహారాల్లో ఒకటి. సెలీనియం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో సెలీనియం లోపం ఉంటే థైరాయిడ్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవాలని సూచిస్తారు.

హార్మోన్ల మార్పిడికై..

థైరాక్సిన్ (T4) హార్మోన్ను శరీరానికి అవసరమైన ట్రైఐయోడోథైరోనిన్ (T3)గా మార్చుతుంది. ఈ ప్రక్రియకు సెలీనియం అవసరం. బ్రెజిల్ నట్స్ ఈ ఖనిజాన్ని శరీరానికి అందిస్తాయి కాబట్టి.. హార్మోన్ల మార్పిడి సులభంగా జరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్లు

థైరాయిడ్ గ్రంథి పని చేసే సమయంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్ నట్స్లోని సెలీనియం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేసి కణాలను రక్షించడంలో సహాయం చేస్తాయి.

కొన్ని అధ్యయనాలు సెలీనియం తీసుకోవడం వల్ల హషిమోటోస్ థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల్లో యాంటీబాడీల స్థాయిలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అందుకే దీనిపై ఇంకా మరిన్ని పరిశోధనలు కొనసాగాల్సి ఉంది.

జుట్టు రాలడం తగ్గవచ్చు

థైరాయిడ్ సమస్యల వల్ల చాలామందిలో జుట్టు రాలడం కనిపిస్తుంది. సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.

అలసట దూరం

థైరాయిడ్ పనితీరు తగ్గినప్పుడు అలసట, బలహీనత కనిపిస్తాయి. బ్రెజిల్ నట్స్లోని పోషకాలు శరీరానికి అవసరమైన శక్తి ఉత్పత్తి ప్రక్రియలకు మద్దతు ఇస్తాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మెరుగై.. థైరాయిడ్ సమస్యలతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

థైరాయిడ్ సమస్యలు కొన్నిసార్లు కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపవచ్చు. ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్రెజిల్ నట్స్ తీసుకుంటే వాటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

అయితే ఇది ఆరోగ్యానికి మంచిది అయినా లిమిటెడ్ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజుకు 1–2 బ్రెజిల్ నట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తింటే వికారం, జుట్టు రాలడం, గోళ్ల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. దీనిని తీసుకోవాలనుకుంటే రాత్రుళ్లు నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు.

గుర్తించుకోవాల్సిన విషయం..

బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ మందులకు ప్రత్యామ్నాయం కాదు. ఇది కేవలం సమస్యను అదుపులో ఉంచేందుకు మాత్రమే హెల్ప్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యుడు లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. బ్రెజిల్ నట్స్ను సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam