Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..
Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు- భారీ సంఖ్యలో ఆస్తులు గుర్తింపు!
Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించారు.
మహబూబ్నగర్, నలగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. బెంగళూరు నగరంలో ఒక ఎకరా భూమి, కర్ణాటక 3 ఎకరాల భూమి, జహీరాబాద్లో 6 ఎకరాలు భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేస్కున్నారు. భీమ్ రెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
Chandra Babu Latest News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Chandra Babu Latest News: మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పిన వైఎస్ జగన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు వచ్చిన అమరావతిని కదల్చలేరని అన్నారు. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని అన్నారు.
Kavitha Arrest: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్!
Kavitha Arrest: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు భగ్నం చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లు తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు.
Telangana Latest News: పోలీసులతో బీఆర్ఎస్నేతల వాగ్వాదం- మంత్రులు పిలిస్తే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం
గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలపై మంత్రులతో చర్చిచేందుకు సిద్ధమని గన్పార్క్ వద్దకు బయల్దేరిన హరీష్రావు, ప్రవీణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నడిచింది. మంత్రులు పిలిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించారు. కార్లు వెళ్లనీయకపోవడంతో కాలినడకన వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యారు.
Telangana Latest News: గన్ పార్క్ వద్దే చర్చిద్దాం! తెలంగాణ భవన్ నుంచి బయల్దేరిన హరీష్! మధ్యలో అడ్డుకున్న పోలీసులు !
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. గురుకులాల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై గన్పార్క్ వద్ద చర్చిద్దామని కాంగ్రెస్ సవాల్ చేసింది. దీన్ని స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు హరీష్, ప్రవీణ్కమార్ తెలంగాణ భవన్ను బయల్దేరారు. మార్గ మధ్యలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Telangana Latest News: తెలంగాణ అప్పులపై పొలిటికల్ హైడ్రామా! కేటీఆర్, హరీష్ చర్చకు రావాలని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బైఠాయింపు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై రాజకీయ కాకా రేగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆధారంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ సవాల్ చేశారు. దీనికి స్పందించిన మంత్రులు తాము చర్చకు రడీ అంటూ సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు వస్తానని మంత్రి జూపల్లి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తాము కూడా చర్చకు సిద్ధమని మరికొందరు మంత్రులు రెడీ అయ్యారు. వారంతా గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి చర్చకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే చర్చించేందుకు కేసిఆర్, కేటీర్, హరీష్ రావు రావాలని డిమాండ్ చేశారు.
Hyderabad Latest News: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 మంది మహిళలు అరెస్టు- నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం
Hyderabad Latest News: నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించిన 20 మంది మహిళలను ఎయిర్పోర్ట్ అధికారులు అరెస్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు సందర్భంగా నకిలీ వీసాల బాగోతం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఎయిర్పోర్ట పోలీసులకు అప్పగించారు.
AP TET 2026: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్డేట్!
AP TET 2026:ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అప్లై చేసిన వారు తప్పులు చేసి ఉంటే సరి చేసే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తోంది. దీని కోసం వన్టైం డిలీట్ ఆప్షన్ను కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
Author : Khagesh

