కోల్‌కతాలో వరుస మర్డర్స్. అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసే సైకో కిల్లర్. చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులకు సవాల్ ఈ కేసు సవాల్‌గా మారుతుంది.
అలాంటి టైంలో ఈ కేసు టేకప్ చేస్తుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్). తీవ్ర మానసిక సంక్షోభంలో ఉన్న ఆమె ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది అనేదే సరికొత్త సిరీస్ స్టోరీ.
దాదాపు రెండేళ్ల తర్వాత కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌కు అభినయ్ డియో దర్శకత్వం వహించారు. కరిష్మాతో పాటు జిషు షేన్ గుప్తా, హెలెన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టైటిల్ బ్రౌన్. జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో అందుబాటులోకి రానుంది. టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

