Buddha Purnima 2026: కపిలవస్తు రాజైన శుద్ధోధనుడు - మహామాయల సంతానం సుద్ధోధనుడు . జ్ఞానోదయం పొందాక సిద్దార్థుడు బుద్ధుడిగా మారాడు. ఆ రోజు వైశాఖ పౌర్ణమి కావడంతో బౌద్ధులకు ఈ రోజు అత్యంత ప్రత్యేకం.
తల్లి మహామాయ మరణం తర్వాత సవతి తల్లి గౌతమి వద్ద పెరగడంతో గౌతముడు అని పిలుస్తారు. యశోధరతో సిద్ధార్థుడి వివాహం జరిగింది..వీరికి రాహులుడు అనే కుమారుడు. ఓసారి నగర పర్యటన చేస్తుండగా ఓ వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, మృతదేహం, సన్యాసిని చూశాక సిద్ధార్థుడి ఆలోచనలు మారిపోయాయి. జీవితం దుఃఖమయం అనిపించి 29వ సంవత్సరంలో ఇంటిని వెళ్లిపోయి..వివిధ ప్రాంతాల్లో గురువుల వద్ద శిష్యరికం చేశారు. గయ ప్రాంతంలో ఓ రావిచెట్టుకింద 40 రోజుల ధ్యానం తర్వాత జ్ఞానం పొందాడు. ఆ ప్రదేశాన్ని బుద్ధగయగా, ఆ వృక్షాన్ని బోధి వృక్షంగా పూజిస్తారు. విగ్రహారాధనకు అనుమతి ఇవ్వని బుద్ధుడు తన బదులు రావిచెట్టుకి పూజలు చేయమని చెప్పాడు. రావిచెట్టుకి మొదటగా పూజలు చేసింది కూడ వైశాఖ పౌర్ణమి రోజే. అందుకే అత్యంత విశిష్టమైన ఈ రోజున నిజమైన జ్ఞానం, శాంతి, సంతోషాన్ని కోరుకుంటూ మీ బంధుమిత్రులకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.
బుద్ధుని బోధనల నుంచి నిజమైన జ్ఞానం మీ సొంతం కావాలి
హ్యాపీ బుద్ధ పూర్ణిమ
బరుద నుంచి వచ్చిన తామరలా సవాళ్లను అధిగమించండి
వైశాఖ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
బుద్ధ భగవానుని బోధనలు మిమ్మల్ని శాంతి, జ్ఞానం, కరుణ మార్గంలో నడిపించుగాక. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
ఈ పవిత్రమైన బుద్ధ పౌర్ణమి రోజున, మనమందరం కోరికలను జయించి, అంతర్గత శాంతిని పొందే శక్తిని పొందాలి. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధ భగవానుని బోధనలను జీవితాలలో స్వీకరించి, ఆయన జననం, జ్ఞానోదయాన్ని వేడుకగా చేసుకుందాం. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధుని జ్ఞాన కాంతి మీ మార్గానికి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేసి, మీ జీవితాన్ని శాంతి, ప్రశాంతతతో నింపాలని కోరుకుంటున్నాను. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధ భగవానుని గొప్ప బోధనలను స్మరించుకుంటూ, మనం దయ, కరుణ , వివేకంతో ఉండేందుకు ప్రయత్నిద్దాం. మీకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధుని బోధనలు మిమ్మల్ని సత్యం, ప్రేమ, ఆనందంతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించుగాక. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధ పౌర్ణమి మీ జీవితం నుంచి చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి, దానిని జ్ఞానంతో, ప్రబుద్ధతతో నింపాలని ఆశిస్తున్నాను. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధ పౌర్ణమి జరుపుకుంటున్న ఈ సందర్భంగా, మన జీవితంలో స్వీయ క్రమశిక్షణ, కరుణ , జాగరూకత యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకుందాం.
బుద్ధ పౌర్ణమి నాడు, మీ హృదయం ప్రేమతో, మీ మనస్సు జ్ఞానంతో, మీ ఆత్మ శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాను. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
మీకు ఆనందకరమైన, శాంతియుతమైన బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. బుద్ధ భగవానుడు మీకు జ్ఞానాన్ని, ప్రశాంతతను ప్రసాదించుగాక.
బుద్ధ పౌర్ణమి సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జీవితం ఆనందం, శాంతి , బుద్ధ భగవానుని జ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను.
బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు! భగవాన్ బుద్ధుడు మిమ్మల్ని సన్మార్గంలోకి, శాశ్వత ఆనంద మార్గంలోకి నడిపించుగాక.
బుద్ధ పౌర్ణమి సందర్భంగా, మీకు శాంతి, ప్రేమ , ఆనందం కలగాలని కోరుకుంటున్నాము. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
బుద్ధుని ప్రశాంతత , జ్ఞానం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Author : RAMA

