Samuthirakani's Carmeni Selvam OTT Release Date Locked : నటుడు, డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా కార్మేని సెల్వం.
ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జూన్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కార్మేని సెల్వం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు రామ్ చక్రి దర్శకత్వం వహించగా... సముద్ర ఖనితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పాత్ వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు ఈ మూవీని నిర్మించారు. మిడిల్ క్లాస్ కష్టాలు, అప్పులు, ఇబ్బందుల నుంచి బయట పడేందుకు చేసిన పోరాటాలు అన్నీ ప్రధానాంశంగా మూవీని రూపొందించారు.
స్టోరీ ఏంటంటే?
సెల్వం (సముద్రఖని) ఓ కారు డ్రైవర్. భార్య పిల్లలే లోకంగా బతుకుతుంటాడు. సంపత్ (గౌతమ్ మీనన్), దేవి (అభినయ) దంపతుల వద్ద ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మీ ప్రియ) ఇంటి దగ్గర ఓ చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకుని భర్తకు చేదోడుగా ఉంటుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇద్దరూ కలసి కష్టపడుతుంటారు. కొంతకొంతగా డబ్బులు కూడబెట్టుకుంటారు. ఓసారి మేనకోడలి ఫంక్షన్లో సారె పెట్టే విషయంలో వీరికి తీవ్ర అవమానం జరుగుతుంది.
దీంతో శాంతి తాము దాచుకున్న డబ్బులతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ సారె పెడుతుంది. ఇది జరిగిన కొన్ని రోజులకు సెల్వం కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఓనర్ విదేశాలకు వెళ్లడంతో కొడుకు వైద్యానికి 10 వేలు అవసరమై కారును రెంట్కు తిప్పుతాడు. అలా అప్పులు తీర్చడం కోసం దాన్ని క్యాబ్ సర్వీసుకు తిప్పుతాడు. క్రెడిట్ కార్డులు, అప్పులు ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. వీటిని తీర్చే క్రమంలో ఆ కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? తన కారును అద్దెకు తిప్పుతున్నారని తెలిశాక సెల్వం పరిస్థితి ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Author : Ganesh Guptha

