Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chanakya Niti In Telugu: ఆ 6 విషయాల్లో నిజం ఎప్పటికీ చెప్పరు! ప్రతి భార్య భర్త దగ్గర దాచే విషయాలు!

Chanakya Niti In Telugu: ఆ 6 విషయాల్లో నిజం ఎప్పటికీ చెప్పరు! ప్రతి భార్య భర్త దగ్గర దాచే విషయాలు!

ABP దేశం 2 weeks ago

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి బోధనలు నాటి తరానికే కాదు తర్వాత తరాలు కూడా అనుసరించేలా ఉంటాయి. రాజనీతి, పాలన, ఆర్థిక సంబంధిత అంశాలు మాత్రమే కాదు..

వ్యక్తిగత జీవితం గురించి చాణక్యుడి బోధనలు చర్చనీయాంశమవుతాయి. కుటుంబ సంబంధాలు, భార్య భర్తల బంధం గురించి కూడా సూటిగా తన భావాలు వ్యక్తం చేశారు ఆచార్య చాణక్యుడు" href="https://telugu.abplive.com/search?s=%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A3%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BF" target="_self">ఆచార్య చాణక్యుడు. నీతిశాస్త్రంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయి.

దాంపత్య జీవితం గురించి, భార్య భర్త భావాలు, ఆలోచనలు, అబద్ధాల గురించి కొన్ని విషయాలు చెప్పారు చాణక్యుడు. అన్నీ చెప్పేసుకుంటాం..తెరిచిన పుస్తకం, తెల్లకాగితం అని చెప్పేవారి మధ్య కూడా కొన్ని రహస్యాలు అలానే ఉండిపోతాయన్నారు. అయితే కొన్ని విషయాలు దాచిపెట్టినప్పుడే ఆ బంధం కలకాలం సాగుతుందని కూడా చెప్పారు చాణక్యుడు. ముఖ్యంగా ప్రతి భార్యా..తన భర్త దగ్గర దాచిపెట్టే ఆరు విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆచార్య చాణక్యుడు. ఇవి రహస్యంగా ఉన్నంతవరకే ఆ బంధం చెడిపోకుండా ఉంటుందని చాణక్యుడి భావన. భర్త దగ్గర భార్య దాచిపెట్టే రహస్యాలేంటంటే...

సీక్రెట్ రిలేషన్

ప్రతి పురుషుడికి, స్త్రీకి...తమ జీవితంలో ఏదో దశలో సీక్రెట్ క్రష్ ఉంటుంది. యవ్వనంలో అయినా, పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో సమస్యల నుంచి బయటపడేందుకు అయినా..ఇలా ఏదో దశలో ప్రతి స్త్రీకి ఓ సీక్రెట్ రిలేషన్ ఉంటుందంటారు చాణక్యుడు. ఈ విషయాన్ని ఏ భార్యా తన జీవిత భాగస్వామికి చెప్పాలని అనుకోదు. ప్రస్తావించే అవసరం, అవకాశం వచ్చినా కానీ బయటపెట్టేందుకు ఇష్టపడదు భార్య. ఈ విషయం రహస్యంగా ఉన్నంతవరకే దాంపత్యజీవితంలో సంతోషం ఉంటుందని చెబుతారు చాణక్యుడ

సరే అనేస్తే పోలా!

అనవసర వాదనలకు దిగేకన్నా సరే అనే రెండక్షరాలు ఎంత పెద్ద వాదనకు అయినా చెక్ పెట్టేస్తాయి. ఇందులో భాగంగా కొన్నిసార్లు తన భాగస్వామి తీసుకునే నిర్ణయాలు నచ్చకపోయినా కానీ ఎందుకొచ్చిందిలే అని సరే అనే మాట ముందుగా చెప్పేస్తుంది భార్య. మనసులో తనకు నచ్చకపోయినా బయటపెట్టదు. సరే అనకపోతే ఆ పని అవకపోగా..నిందమోయాల్సి వస్తుంది..అందుకే కొన్నిసార్లు ఈ పద్ధతే సరైనది అని చాణక్యుడి సూచన

శృంగారం తర్వాత మనసులో మాట చెప్పరు

కలయిక తర్వాత ఏ భార్యా తన భర్తకు నిజం చెప్పదన్నది చాణక్యుడి భావన. మగవారి కన్నా ఆడవారిలో రెట్టింపు కోర్కెలు ఉంటాయని చాణక్యనీతిలో ఉంది. అందుకే శృంగారంలో భర్త సంతృప్తి చెందినా భార్యకు ఆ భావన కలగదు అని..కానీ..ఆ విషయం చెప్పకుండా దాచేస్తారని ప్రస్తావించారు.

డబ్బు దాచడంలో అగ్రస్థానం

ఎంత సంపాదించాం అనేది కాదు ఎంత దాచిపెట్టాం అనేది ముఖ్యం. ఈ విషయంలో మగవారి కన్నా మహిళలు ముందుంటారంటారు చాణక్యుడు. సంపాదించేది భర్తే అయినా అందులో కొంత మొత్తాన్ని భర్తకు తెలియకుండా పొదుపుచేస్తారు భార్యామణులు. గృహలక్ష్మి అనే పదాన్ని అందుకే వినియోగిస్తాం. సమస్య వచ్చినప్పుడు ఆదుకునే బ్యాంక్ ఇది.

ఆరోగ్యం బాగాలేకపోయినా చెప్పరు

ఇంటిపనిలో అలసిపోయినా, ఆరోగ్యం బాలేకపోయినా ఆ విషయాన్ని భర్తకు చెప్పరు. తగ్గుతాయిలే అని నిత్యం తమపని తాము చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా సర్దుకుపోతారు.

మూడో వ్యక్తితో చర్చలు

భార్య భర్త మధ్య వచ్చే అభిప్రాయ బేధాలను మహిళలు మరొకరితో షేర్ చేసుకుంటారన్నది చాణక్యుడి భావన. తమ మనసులో మాట భర్తకు చెబితే ఏమనుకుంటారో, మరింత గొడవలు పెరుగుతాయేమో భావించి మూడో వ్యక్తితో చెబుతారు కానీ భర్త దగ్గర భావోద్వేగాలు దాచేసుకుంటారు.

ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో ఈ రహస్యాలుంటాయ్..ఇవేం ప్రమాదకరం కాదు..వీటిపై ఆరాలు తీస్తే అప్పుడు బంధం బీటలువారే ప్రమాదం ఉంది. అందుకే ఎంత పారదర్శకంగా ఉన్నామని చెప్పే దంపతుల మధ్య అయినా కొన్ని రహస్యాలు ఉండడం తప్పేం కాదంటారు ఆచార్య చాణక్యుడు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam