Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రగ్రహణం సమయంలో పుట్టిన బిడ్డపై ఆ ప్రభావం ఉంటుందా? వాళ్ల జాతకం ఎలా ఉంటుంది?

చంద్రగ్రహణం సమయంలో పుట్టిన బిడ్డపై ఆ ప్రభావం ఉంటుందా? వాళ్ల జాతకం ఎలా ఉంటుంది?

ABP దేశం 1 week ago

Chandra Grahan 2026: ఆగస్టు 28 శ్రావణ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం సంభవిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలను అశుభమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించాలని సూచిస్తారు.

గ్రహణ సమయంలో గర్భిణులు కదలకుండా, బయటకు రాకుండా, గ్రహణ కిరణాలు తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ సమయంలో ప్రసవం జరిగి బిడ్డ పుడితే..గ్రహణం ప్రభావం ఆ బిడ్డపై ఎలా ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలలో నివసించే ప్రజలపై దాని ప్రభావం ఉంటుంది. ఆగస్టు 28న సంభవించే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలో కనిపిస్తుంది. అందుకే భారతదేశంలో ఎలాంటి సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణ నియమాలు అనుసరించాల్సిన అవసరమూ లేదు.

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణం వల్ల తల్లి, బిడ్డలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. అయితే, ఈ సమయంలో బిడ్డ జన్మిస్తే ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్యశాస్త్ర గ్రంథాల్లో ఉంది.

బృహత్ పరాశర హోరా శాస్త్ర సంప్రదాయం ప్రకారం..

గ్రహణ సమయంలో జన్మించడం సవాలుగా పరిగణిస్తారు. ఈ పుస్తకంలోని 91వ అధ్యాయంలో ఉన్న శ్లోకంలో ఇలా ఉంది.

సూర్యేందుగ్రహణే కాలే యేన దత్తం ద్విజాతయే
తత్ సర్వం కోటిగుణితం భవేత్ తస్య న సంశయః

సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో ఇచ్చే దానాల ఫలితం రెట్టింపు ఉంటుంది..

అదే సమయంలో గ్రహణ సమయంలో బిడ్డ జన్మిస్తే.. ఆరోగ్య సమస్యలు, జీవితంతో పోరాటం, ఆర్థిక ఇబ్బందులుంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం..

గ్రహణం సమయంలో చంద్రుని స్థానం రాహువుతో ప్రభావితమవుతుందని భావిస్తారు. అందువల్ల జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుంచి ఆ సమయంలో జననాలలో చంద్రుడు, రాహువుల స్థానం , వాటి మధ్య డిగ్రీ దూరం అనేవి ప్రత్యేకంగా పరిగణించవలసిన అంశాలు. చంద్రుడు మనఃకారకుడు అంటారు. జాతకంలో చంద్రుడి స్థానం సరైన విధంగా లేకుంటే మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతారు.

ఇక చంద్రగ్రహణం సమయంలో జన్మించినట్లయితే, సూర్య విగ్రహం, రాహు విగ్రహం, శాంతి ఆరాధన మొదలైన వాటి ప్రస్తావనలు ఉన్నాయి. వీటి ద్వారా గ్రహణం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

శాస్త్రీయ దృక్కోణం నుంచి చూస్తే..

చంద్రగ్రహణం ఒక ఖగోళ సంఘటన.. అది జనన మరణాలను ప్రభావితం చేయదు. జ్యోతిష్య గ్రంథాలలో కూడా, గ్రహణ సమయంలో జన్మించడాన్ని ప్రత్యేకమైనదిగా భావించి, శాంతి కర్మకాండలు సూచిస్తారు కానీ ఆ బిడ్డ పూర్తి భవిష్యత్తు కేవలం గ్రహణ సమయంలో జన్మించడంపైనే కాకుండా... ఆ సమయంలో ఆ బిడ్డ జాతకంలో ఉండే గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam