Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Charan Mahadev: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఆర్జే చరణ్ మహదేవ్.. రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ వరకు!

Charan Mahadev: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఆర్జే చరణ్ మహదేవ్.. రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ వరకు!

ABP దేశం 1 week ago

Charan Mahadev: బిగ్ బాస్ 10 తెలుగు ఎంట్రీ కోసం కామనర్స్ అగ్నిపరీక్ష సీజన్ 2లో పోటీ పడుతున్నారు. కామనర్స్ టాప్ 13 లిస్ట్లో ఆర్జే మహదేవ్ చరణ్ తేజ్ ఒకరు.

అగ్ని పరీక్ష టాస్క్ల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు. చరణ్ మహదేవ్ రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

రియల్ లైఫ్

మహదేవ్ చరణ్ తేజ్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చరణ్.. రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. యాంకర్గా పలు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు పొందాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ టీచర్గా వ్యవహరిస్తూనే, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష

బిగ్ బాస్ 10వ సీజన్కు ముందుగా కామనర్స్ కోసం నిర్వహిస్తు్న్న 'అగ్నిపరీక్ష 2' లో పోటీదారుడిగా పాల్గొన్నాడు చరణ్ మహదేవ్. కామనర్, డిజిటల్ కంటెస్టెంట్ కేటగిరీలో ఇచ్చిన ఆడిషన్స్లో చరణ్ జడ్జిలను ఆకట్టుకున్నాడు.

బిగ్బాస్ 10లోకి మాధురి రాథోడ్! ఎస్సై కావాలనుకునే యువతి ఫోక్ డ్యాన్సర్గా ఎలా మారింది!

టాస్క్లలో పెర్ఫార్మెన్స్

ఆర్జేగా అనుభవం ఉండటంతో హౌస్లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు చరణ్. ఫిజికల్ అండ్ మైండ్ గేమ్స్లో స్టార్టింగ్ నుంచే చురుగ్గా పాల్గొని తోటి పోటీదారులకు ఆమన్ మసూద్, రోహిత్ నాయుడు వంటి వారికి గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇంజినీరింగ్ నుంచి బుల్లితెర క్రేజ్ వరకు.. సౌందర్య రెడ్డి రియల్ లైఫ్, బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ విశేషాలు!

సోషల్ మీడియా

ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చరణ్ మహదేవ్ యాక్టివ్గా ఉంటాడు. చరణ్కు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన టాలెంట్స్ ప్రదర్శిస్తూ బిగ్ బాస్ వేదికపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఆడిషన్స్లో తనదైన వినోదంతో జడ్జిలను మెప్పించి నేరుగా టాప్ 15 కంటెస్టెంట్లలో ఒకడిగా ఎంపికయ్యాడు. షోలో తన మాటలతో, టాస్క్లలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

బిగ్ బాస్ 10లోకి సినీ నటుడు కృష్ణుడు.. రియల్ లైఫ్, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Author : Satyaprasad Bandaru

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam