Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress With TVK party: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

Congress With TVK party: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

ABP దేశం 1 week ago

TVK Government in Tamil Nadu | చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇదివరకే తమిళనాడు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నప్పటికీ..

బుధవారం మధ్యాహ్నం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు జోసెఫ్ విజయ్, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) కలిసి టీవీకేతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్కి తమిళనాడు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.

‘భారత రాజ్యాంగంపై నమ్మకం లేని మతతత్వ శక్తులను ఈ కూటమికి దూరంగా ఉంచాలనే నిబంధనతో మద్దతు ఇస్తున్నాం. టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ కూటమి, పెరుంతలైవర్ కామరాజ్ తమిళనాడు స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో తందై పెరియార్ సామాజిక న్యాయ సూత్రాలకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు మేం కట్టుబడి ఉంటామని’ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ మద్దతు తరువాత సీపీఐని సైతం విజయ్ మద్దతు కోరారు. రెండు రోజుల్లో జరగనున్న తమ జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేతలు తెలిపారు.

మంగళవారం అర్ధరాత్రి భేటీలో కాంగ్రెస్ నిర్ణయం..

మంగళవారం అర్ధరాత్రి తర్వాత తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా వర్చువల్గా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఇన్ఛార్జి గిరీష్ చందోకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నేతలు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించడంతో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2 మంత్రి పదవులు డిమాండ్ చేసిన కాంగ్రెస్.. !

అయితే, విజయ్ పార్టీకి మద్దతుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొన్ని కండీషన్లు విధించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వంలో తమకు 2 కేబినెట్ పదవులు ఇవ్వాలని, మరికొన్ని డిమాండ్లు చేయగా వాటిలో కొన్నింటికి విజయ్ అంగీకరించడంతో వారి మధ్య మద్దతుకు అభ్యంతరాలు తొలగిపోయాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనైయూర్లోని టీవీకే కార్యాలయంలో విజయ్ను కలిసి మద్దతు లేఖను అందజేయనున్నారు.

ఎవరు ఎన్ని నెగ్గారు.. విజయ్కు ఎన్ని సీట్లు కావాలి..
ఈ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు నెగ్గగా.. డీఎంకే కూటమి 73, అన్నాడీఎంకే 53 చోట్ల విజయం సాధించాయి. అయితే డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల గెలుపొందింది. విజయ్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 10, 11 సీట్లు కావాలి. ఇప్పుడు ఈ సీట్లే విజయ్కి కీలకంగా మారాయి. మరోవైపు సీపీఎం, సీపీఎంలతో పాటు ఇతర చిన్నపార్టీలను మద్దతు కోరుతూ టీవీకే ఆహ్వానం పంపింది. మే 7వ తేదీన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam