Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Crime Thriller OTT : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఫ్రెండ్ మిస్టీరియస్ డెత్... ఏఎస్సై బబిత ఏం చేసింది?

Crime Thriller OTT : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఫ్రెండ్ మిస్టీరియస్ డెత్... ఏఎస్సై బబిత ఏం చేసింది?

ABP దేశం 2 weeks ago

Nimisha Sajayan's Crime Investigation Thriller Babita Singh Reporting OTT Streaming : ఓటీటీలో ఈ శుక్రవారం (ఆగస్ట్ 28) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రెండ్ అవుతోంది.

తన ఫ్రెండ్ మిస్టీరియస్ డెత్ వెనుక నిజాన్ని వెలికి తీసే ఓ యంగ్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథే బబితా సింగ్ రిపోర్టింగ్ (Babita Singh Reporting).

డైరెక్ట్గా స్ట్రీమింగ్

ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఆగస్ట్ 28 నుంచి డైరెక్ట్గా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ వెర్షన్ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అంబికా పండిట్ దర్శకత్వం వహించగా... నిమిషా సజయన్తో పాటు బరున్ సోబ్తి, అన్షుమాన్ పుష్కర్, సునీత రజ్వార్, రాజేష్ కుమార్, గీత విద్యా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

'పాతాళ్ లోక్', 'కోహ్రా' వంటి వెబ్ సిరీస్లతో డిజిటల్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సుదీప్ శర్మ ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఫిల్మ్ స్క్వాడ్ ప్రొడక్షన్స్, యాక్ట్ త్రీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Thanuja Web Series OTT : ట్రెండింగ్లో బిగ్ బాస్ తనూజ వెబ్ సిరీస్ - ఎందుకంత స్పెషల్... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

బబితా సింగ్ అలియాస్ బేబీ అనే మహిళా పోలీస్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. తన తండ్రి డ్యూటీలో చనిపోవడంతో కారుణ్య నియామకంలో భాగంగా బబితా అలియా బేబీ (నిమిషా సజయన్) కి ఏఎస్ఐ ఉద్యోగం వస్తుంది. డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే ఏ తప్పూ చేయకపోయినా సస్పెన్స్కు గురవుతుంది. దీంతో తన సొంతూరికి వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి ఫ్రెండ్ బన్సి (బరుణ్ సోబ్తి) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని తెలుస్తుంది. అసలు తన ఫ్రెండ్ ఎలా చనిపోయాడు? ఎవరైనా మర్డర్ చేశారా? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ జర్నీలో ఆమెకు ఎదురైన సవాళ్లు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Korean Kanakarju OTT : ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam